
మూడోసారి ఎన్డీఏ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక, తెలంగాణలో ప్రజలు ఎన్డీఏ కూటమిని అక్కున చేర్చుకున్నారని మోదీ అన్నారు. కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చాయి.. అంతే త్వరగా ప్రజల విశ్వాసం కోల్పోయాయని చెప్పారు. ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్డీఏను ఆదరించారన్నారాయన. తమిళనాడులో మనకు ఒక్క సీటు రాకపోవచ్చు.. కాని మున్ముందు ఏం జరుగుతుందో తెలుస్తోందన్నారు.
2024, జూన్ 7వ తేదీ శుక్రవారం పార్లమెంట్ పాత భవనంలో మోదీ అధ్యక్షతన ఎన్డీఏ భాగస్వామ్య పక్ష ఎంపీల మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ.. భారత్ మాతాకి జై అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తనపై నమ్మకంతో దేశ నాయకత్వ బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు. విశ్వాసం అనే బంధం మనల్నీ కలిపిందని కూటమి నేతలను ఉద్దేశించి అన్నారు. ' ప్రభుత్వ ఎర్పాటుకు మెజార్టీ అవసం..కానీ, దేశాన్ని నడపటానికి అందరి సహకారం అవసరం.. అందుకే అందరి సహకారం తీసుకుంటాం' అని మోదీ అన్నారు.
ప్రజల కలలను నెరవేర్చేందుకు రాత్రి పగలు కష్టపడ్డానని.. దేశానికి సేవ చేసే భాగ్యం మరోసారి లభించిందన్నారు మోదీ. గోవా, ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా క్రైస్తవులు ఉన్నారని.. అక్కడ కూడా సేవా చేసే భాగ్యం మనకు లభించిందని చెప్పారు. ఎన్నికలకు ముందు ఏర్పాటు అయిన ఇండియా కూటమి... ఎన్డీఏ లాగా ఎన్నడూ విజయవంతం కాలేదన్నారు. ఎన్డీఏ అత్యంత విజయవంతమైన కూటమని చెప్పారు. గత 30ఏళ్లలో ఇది పూర్తి స్థాయిలో విజయవంతమైన కూటమి అని... 30ఏళ్లుగా కూటమి ఉండటం మామూలు విషయం కాదన్నారు. 'ఎన్డీఏ నేతలందిరినీ గమనించండి.. మా అందరిలో ఒక పోలిక ఉంది. అది సుపరిపాలన. భారత రాజకీయల్లో మనది సహజసిద్ధమైన కూటమి' అని చెప్పారు. ఎన్డీఏ కూటమి భారతదేశ ఆత్మగా నిలుస్తుందన్నారు. దేశాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నానని మోదీ చెప్పారు.
కర్ణాటక, తెలంగాణలో ప్రజలు మనల్నీ అక్కున చేర్చుకున్నారని మోదీ అన్నారు. కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చాయి.. అంతే త్వరగా ప్రజల విశ్వాసం కోల్పోయాయని చెప్పారు. ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్డీఏను ఆదరించారన్నారాయన. తమిళనాడులో మనకు ఒక్క సీటు రాకపోవచ్చు.. కాని మున్ముందు ఏం జరుగుతుందో తెలుస్తోందన్నారు.