నరేష్ అగస్త్య, సంజనా సారథి జంటగా నితిన్ లింగుట్ల దర్శకత్వంలో బి. చంద్రకాంత్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘మరొక్కసారి’. ఫీల్ గుడ్ రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. రిచ్ విజువల్స్, లొకేషన్స్‌లో బలమైన ఎమోషన్స్‌ను సన్నివేశాల్లో చూపించటానికి డిఫరెంట్ లొకేషన్స్‌లో సినిమాను చిత్రీకరించారు.
కేరళతోపాటు టిబెట్ సరిహద్దుకు దగ్గరలోని అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో గురుడోంగ్మార్ సరస్సు వద్ద కూడా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సరస్సు వద్ద చిత్రీకరించిన మొదటి భారతీయ సినిమాగా ఇది నిలిచిందని మేకర్స్ చెప్పారు.
ప్రస్తుతం సినిమా షూటింగ్ పూర్తయిందని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తామని తెలియజేశారు. బ్రహ్మాజీ, సుదర్శన్, వెంకట్ కాకమాను ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి భరత్ మాంచిరాజు సంగీతం అందిస్తున్నాడు.
