Malli pelli Review: నిజంగా అంత బాగుందా.. న్యూ ఏజ్ స్టొరీ ఆడియన్స్ను మెప్పించిందా?

Malli pelli Review: నిజంగా అంత బాగుందా.. న్యూ ఏజ్ స్టొరీ ఆడియన్స్ను మెప్పించిందా?

ప్రముఖ నిర్మాత MS రాజు దర్శకత్వంలో సీనియర్ నటుడు నరేష్, పవిత్ర లోకేష్ జంటగా తెరకెక్కిన సినిమా మళ్ళీ పెళ్లి. నటుడు నరేశ్ జీవితంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిందని మూవీ ట్రైలర్ చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. రిలీజ్ కు ముందే మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా మే 26 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది, ఆడియన్స్ ను ఏమేరకు మెప్పించింది అనేది తెల్సుకుందాం. 

సినిమా చూసిన చాలామంది తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేధికగా పంచుకుంటున్నారు. ప్రేక్షకుల నుండి ఈ సినిమాకు పాజిటీవ్ గా రెస్పాన్స్ వస్తోంది. ఇది ఒక న్యూ ఏజ్ స్టొరీ అని, సినిమాలో ఎమోషన్స్ బాగా వర్క్ అవుట్ అయ్యాయని, ప్రస్తుతం జనరేషన్ లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యని చాలా బాగా చూపించారని కామెంట్స్ చేస్తున్నారు. ఇక కొందరేమో సినిమా యావరేజ్ గా ఉందని, నరేష్, పవిత్ర కాకుండా వేరే వాళ్ళు యాక్ట్ చేసుంటే బాగుండేదని చెప్తున్నారు.

ఇక ఈ కామెంట్స్ చూసిన చాలామంది సినిమా నిజంగా అంతబాగుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా కొందరైతే రివ్యూలు కూడా డబ్బులు ఇచ్చి రాయిస్తున్నారు అని కామెంట్స్ చేస్తున్నారు. మరి మొత్తంగా ఈ సినిమాకైతే యావరేజ్ టాక్ వస్తోంది.