నటుడిగా విభిన్న పాత్రలు పోషిస్తూ లీడ్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా వరుస సినిమాలు చేస్తున్న వీకే నరేష్స్వతంత్ర బాబు అనే మరో డిఫరెంట్ క్యారెక్టర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రంలో ఆయన ఈ పాత్ర పోషిస్తున్నారు.
బుధవారం తన పాత్రను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఒక చేతిలో బాటిల్ మరో చేతిలో టేప్ రికార్డర్ పట్టుకొని డాన్స్ వైబ్‌లో కనిపించిన నరేష్ లుక్ ఆకట్టుకుంది. సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ, రవీనా టాండన్ కూతురు రాషా తడాని జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అశ్వినీ దత్ సమర్పణలో పి. కిరణ్ నిర్మిస్తున్నారు.
