మెహబూబా ముఫ్తీకి తప్పిన ముప్పు

మెహబూబా ముఫ్తీకి తప్పిన ముప్పు

అనంతనాగ్:  జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి​ మెహబూబా ముఫ్తీకి పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్​అయింది. అయితే, ఈ ప్రమాదంలో ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. ఆమె డ్రైవర్, వ్యక్తిగత భద్రతా సిబ్బందిలోని ఓ పోలీసు అధికారికి స్వల్ప గాయాలయ్యాయి. అనంతనాగ్ జిల్లాలోని సంగమ్ వద్ద గురువారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించేందుకు ఆమె ఖానాబాల్‌‌‌‌ కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 

ఆమె ప్రయాణిస్తున్న స్కార్పియో వెహికల్.. మరో కారును ఢీకొట్టింది. ఈ యాక్సిడెంట్​లో ముఫ్తీ వెహికల్​ తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ ఘటన అనంతరం ఆమె యథావిధిగా ఖానాబాల్‌‌‌‌ కు వెళ్లిపోయారు.   కాగా.. దేవుడి దయవల్ల ముఫ్తీ, ఆమె భద్రతా అధికారులు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారని ముఫ్తీ కూతురు ఇల్తిజా ఎక్స్​ లో పోస్ట్ చేశారు. తాను క్షేమంగా ఉన్నానని, తన కోసం ప్రార్థించిన అందరికీ ముఫ్తీ ధన్యవాదాలు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన తన డ్రైవర్, పర్సనల్​ సెక్యూరిటీ ఆఫీసర్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నానని ట్వీట్ చేశారు.