శాంతి భద్రతలో తెలంగాణ అగ్రగామి:  మంత్రి మహమ్మద్ అలీ

శాంతి భద్రతలో తెలంగాణ అగ్రగామి:  మంత్రి మహమ్మద్ అలీ

రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీస్ విభాగానికి మౌలిక వసతులు కల్పించడంతో శాంతి భద్రతల విషయంలో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందన్నారు రాష్ట్ర హోం మంత్రి మహమ్మద్ అలీ. రంగారెడ్డి జిల్లాలోని నార్సింగి పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని మార్చి 24, శుక్రవారం ఆయన ప్రారంభించారు. పోలీస్ శాఖకు మౌలిక వసతులు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. దేశంలో ఉన్న సీసీ కెమెరాలలో 64% సీసీ కెమెరాలు తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయని స్పష్టం చేశారు మహమ్మద్ అలీ.
 
 ఒకప్పుడు ప్రజలు పోలీస్ స్టేషన్ కి వెళ్లాలంటే  భయపడేవాళ్లు.. కానీ ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ విధానం వచ్చాక ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేస్తున్నారన్నారు మంత్రి మహమ్మద్ అలీ. ఈ కార్యక్రమంలో పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, ఎంపీ రంజిత్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అనిత హరినాధ్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, సైబరాబాద్ కమిషనరేట్ సిపి స్టీఫెన్ రవీంద్ర, తదితరులు పాల్గొన్నారు.