సదర్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

సదర్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

రంగారెడ్డి : నగర శివారులో సదర్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. నార్సింగి మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ వెంకటేశ్ యాదవ్ ఆధ్వర్యంలో నార్సింగి చౌరస్తాలో సదర్ సమ్మేళనం జరిగింది. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ దున్నపోతులకు ప్రత్యేక పూజలు నిర్వహించి సదర్ ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం దున్నపోతుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

నార్సింగి సదర్ ఉత్సవాల్లో ఆల్ ఇండియా ఛాంపియన్ షిప్ అందుకున్న దున్నపోతు చాంద్ వీర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరోవైపు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తీన్మార్ స్టెప్పులేసి అందరిలో జోష్ నింపారు. సినీ నటుడు, మిమిక్రీ కళాకారుడు శివారెడ్డి సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సదర్ ఉత్సవాలను తిలకించేందుకు వందల మంది నార్సింగికి తరలి వచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు.