నాసా పై కరోనా ఎఫెక్ట్

నాసా పై  కరోనా ఎఫెక్ట్
  •                     ఒక సైంటిస్టుకు పాజిటివ్.. ఐసోలేషన్ లో మరికొందరు
  •                 ఒక సైంటిస్టుకు పాజిటివ్.. ఐసోలేషన్ లో మరికొందరు
  •                 మూన్ రాకెట్ తయారీ నిలిపివేత

కరోనా మహమ్మారి ఎఫెక్ట్ అమెరికా అంతరిక్ష సంస్థ నాసాపైనా పడింది. నాసా సైంటిస్టుల్లోనూ ఒకరికి కొవిడ్–19 కన్ఫమ్ కాగా, మరికొందరు ఐసోలేషన్ లో ఉన్నారు. దీంతో 2024లో చంద్రుడి మీదకు మనుషులను పంపేందుకు నాసా చేపట్టిన ఆర్టెమిస్ మిషన్ కు కూడా ఇబ్బందులు మొదలయ్యాయి. ఈ మిషన్ కోసం స్టెన్నిస్ స్పేస్ సెంటర్ లో రాకెట్, క్యాప్సూల్ ను తయారు చేస్తుండగా, ఆ పనులను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు నాసా అడ్మినిస్ట్రేటర్ జిమ్ బ్రైడెన్ స్టన్ గురువారం రాత్రి వెల్లడించారు. స్టెన్నిస్ సెంటర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొవిడ్–19 కేసులు బాగా నమోదయ్యాయని, ఈ సెంటర్ లో మూన్ మిషన్ పనులన్నీ పూర్తిగా నిలిపేశామని తెలిపారు.