భూమ్మీద సేఫ్ గా ల్యాండ్ అయిన ఓరియన్ క్యాప్సూల్స్

భూమ్మీద సేఫ్ గా ల్యాండ్ అయిన  ఓరియన్ క్యాప్సూల్స్

నాసా ఆర్టిమిస్ ప్రయోగంలో భాగంగా లాంచ్ చేసిన ఓరియన్ స్పేస్ క్యాప్సూల్...సేఫ్ గా భూమిపైకి రిటర్న్ అయింది. ఫసిఫిక్ మహాసముద్రంలో మూడు పెద్ద ఎరుపు, తెలుపు పారాచూట్ ల సహాయంలో కిందికి వచ్చింది. ఈ ఓరియన్ స్పేస్ క్యాప్సూల్ 25 రోజుల పాటు చంద్రుడి చుట్టూ కక్ష్యలో తిరిగి వచ్చింది. హీట్ షీల్డ్ సహా పలు ప్రయోగాలు ఈ స్పేస్ క్యాప్సూల్ ద్వారా నిర్వహించారు నాసా సైంటిస్టులు. 2025 నాటికి మనుషులకు చంద్రుడి మీదికి పంపేలా నాసా ప్రయోగాలు చేస్తోంది. 

చంద్రుడికి సమీపంలోకి వెళ్లి తిరిగి భూమ్మీదకు క్షేమంగా రావడం కోసం ఈ ప్రయోగం చేశారు. భూ వాతావరణంలోకి వచ్చే ఏ ఆబ్జెక్ట్ అయినా మండిపోతుంది. అయితే ఈ ఓరియన్ స్పేస్ క్యాప్సూల్ కు అమర్చిన హీట్ షీల్డ్స్ దాన్ని మండిపోకుండా అడ్డుకుంటుంది. ఇప్పుడు ఓరియన్ పసిఫిక్ మహాసముద్రంలో దిగడంతో హీట్ షీల్డ్స్ ఉష్ణోగ్రతను తట్టుకున్నట్లు రుజువైంది. భవిష్యత్ లో స్పేస్ లోకి ఆస్ట్రొనాట్లు వెళ్లి తిరిగి భూవాతావరణంలోకి సేఫ్ గా రావడానికి ఈ ప్రయోగం చేపట్టారు. 

భూమ్మీదకు సేఫ్ గా ల్యాండ్ అయిన ఓరియన్ క్యాప్సూల్ ఈ ప్రయోగం..చంద్రుని అన్వేషణలో అత్యంత కీలకమైన ముందడుగుగా నాసా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు. సంవత్సరాల తరబడి వేలాది మంది కృషి..ఈ మిషన్ సక్సెస్ లో దాగి ఉన్నాయనీ, ఈ ప్రయోగం రాబోయే రోజుల్లో మానవులు విశ్వ తీరాలకు చేరుకోడంలో కీలక పాత్ర పోషిస్తుందని. అంచనా వేస్తున్నారు సైంటిస్టులు.