30 నుంచి నాటా తెలుగు మహాసభలు

30 నుంచి నాటా తెలుగు మహాసభలు


హైదరాబాద్, వెలుగు: అమెరికాలోని డల్లాస్​లో ఈ నెల 30 నుంచి నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (నాటా) తెలుగు మహాసభలు జరగనున్నాయి. జులై 2 వరకు జరగనున్న ఈ సభలకు పలువురు తెలుగు ప్రముఖులను ఇన్వైట్ చేస్తున్నామని అసోసియేషన్ వెల్లడించింది. నాటా అధ్యక్షుడు కొర్సపాటి శ్రీధర్ రెడ్డి, సెక్రటరీ గండ్ర నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతాయని తెలిపింది. సభలకు తెలుగు రాష్ట్రాల నుంచేగాక ప్రపంచ నలు మూలల నుంచి ఎంతో మంది వస్తారని వివరించింది. వ్యాపారాలను, ఉత్పత్తులను ప్రపంచ స్థాయిలో మార్కెటింగ్​ చేసుకోవడానికి నాటా తెలుగు మహా సభలు గొప్ప వేదిక అని పేర్కొంది. ఎగ్జిబిషన్​లో స్టాల్స్ ఏర్పాటు చేసుకోవా లనుకునేవారు నాటా పీఆర్ అండ్ మీడియా డీవీ కోటి రెడ్డి (9848011818) నంబర్​ను సంప్రదించాలని, కార్యక్రమాల్లో  పాల్గొనాలను కునే వారు  www.nataconventions.org వెబ్ సైట్​లో పేర్లు నమోదు చేసుకోవాలని కోరింది. వేడుక ముగిసిన తర్వాత కూడా పోర్టల్ ద్వారా రెం డు, మూడు నెలలపాటు కస్టమర్లకు అందుబాటులో ఉండొచ్చని అసోసియేషన్  పేర్కొంది.