
నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (ఎన్ఎల్సీఓ) భువనేశ్వర్ డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 11.
పోస్టులు: 33( సీనియర్/ డిప్యూటీ/ జనరల్ మేనేజర్)
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, సీఏ, పీజీ డిప్లొమా, ఎల్ఎల్ బీ, ఎంఎస్సీలో ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 2025 ఆగస్టు 11 నాటికి 35 నుంచి 48 ఏండ్ల మధ్యలో ఉండాలి.
అప్లికేషన్ : ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ల ప్రారంభ తేదీ : జులై 11.
అప్లికేషన్ల లాస్ట్ డేట్: ఆగస్టు 11.
సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.