ఒప్పుకున్న పాత్ర కోసం ఏమైనా చేస్తా!

ఒప్పుకున్న పాత్ర కోసం ఏమైనా చేస్తా!

అడివి శేష్, రెజీనా ప్రధాన పాత్రల్లో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ ‘ఎవరు’. ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానున్న సందర్భంగా రెజీనాతో చిట్‌ చాట్.

  • ‘ఎక్‌ లడ్‌కీకో దేఖాతో ఐసా లగా’ అనేది ఇద్దరు అమ్మాయిల మధ్య రిలేషన్‌ గురించి చర్చిం చిన సినిమా. బాలీవుడ్‌లో ఇలాంటి పాత్రతో ఎంట్రీ ఇవ్వొచ్చా లేదా అని చాలా ఆలో చించాను. కానీ మంచి కథ. బలమైన పాత్ర. అందుకే అంగీకరించాను. నా నిర్ణయం సరైనదే. సినిమా చూశాక నా లెస్బియన్‌ ఫ్రెండ్స్‌ అందరూ కంటతడి పెట్టుకున్నారు. ఇలాంటి సినిమా చేసినందుకు ముందు సోనమ్‌ కపూర్‌‌ని మెచ్చుకోవాలి.
  •                డైరెక్టర్ రామ్‌‌జీ, శేష్‌‌ చెన్నై వచ్చి స్టోరీ చెప్పారు. చాలా నచ్చింది. నేరేషన్ వింటున్నప్పుడే సమీర అనే అమ్మాయి  పిక్చర్ నా మనసులోకి వచ్చేసింది. దాంతో వెంటనే ఓకే చెప్పేశాను.
  •                 ఇప్పటి వరకు చాలా రకాల పాత్రలు చేశాను కానీ ఇంత ఇంటెన్సిటీ ఉన్నది చేయలేదు. అన్ని ఎమోషన్స్‌‌ ఉన్న రోల్. అందుకే చాలా ఇన్‌‌వాల్వ్ అయిపోయాను. సమీర ఇలాగే ఉండాలి అని మైండ్‌‌లో ఫిక్స్ అయిపోయాను. లాంగ్ హెయిర్‌‌‌‌ ఉండాలని డైరెక్టర్ చెప్పినా కూడా షార్ట్‌‌ హెయిరే ఉండాలని పట్టుబట్టానంటే నేనా పాత్రతో ఎంత కనెక్టయిపోయానో అర్థం చేసుకోవచ్చు.
  •                 సమీర ఒక సీఈవో భార్య. కష్టపడి పైకొచ్చిన యువతి. ఎక్కువ మాట్లాడదు. అనుకోకుండా జరిగిన ఓ సంఘటన ఆమె జీవితాన్ని ఎలా మార్చింది, దాన్ని  ఎలా ఎదుర్కొంటుంది అనేది కథ. సమీర పాత్రను నాకు నచ్చినట్టుగా చేసే ఫ్రీడమ్‌‌ ఇచ్చారు. దాంతో  ఇన్‌‌వాల్వ్ అయ్యి చేశాను. సినిమా చూసినప్పుడు రెజీనా ఎవ్వరికీ కనిపించదు. సమీర మాత్రమే కనిపిస్తుంది.
  •                 నా క్యారెక్టర్ విషయంలో ఎవరి జోక్యాన్నీ నేను ఇష్టపడలేదు. అందుకే డబ్బింగ్ కూడా నేనే
    కష్టపడి చెప్పుకున్నాను. మొత్తమంతా కలిపి  దాదాపు డెబ్భై గంటలు పట్టింది. అంతసేపూ డైరెక్టర్  నాతోనే ఉన్నారు. ప్రతి పదం విడమర్చి చెప్పేవారు. ఆయన ఓపికకి మెచ్చుకోవాలి.
  •                 ట్రైలర్ చూసి కొందరు ‘బద్‌‌లా’ సినిమా పోలికలు కనిపిస్తున్నాయంటున్నారు. నాకు తెలిసి రెండింటికీ పోలిక లేదు. సినిమా చూశాక ఆ విషయం  అందరికీ అర్థమవుతుంది.
  •                 రామ్‌‌జీకి డైరెక్షన్ ఒక్కటే కాదు, అన్ని క్రాఫ్ట్స్‌‌ గురించీ అవగాహన ఉంది. మేనేజ్‌‌మెంట్ స్కిల్స్‌‌ కూడా ఎక్కువ. అలసిపోడు, విసుక్కోడు. తనకేం కావాలో క్లారిటీతో ఉంటాడు. ఇక శేష్ అద్భుతమైన నటుడు. థ్రిల్లర్ అనేది తన జానర్. కాబట్టి చించేస్తాడు.
  •                 నా కెరీర్‌‌‌‌కి ఉపయోగపడుతుందా లేదా అని ఆలోచించి నేనెప్పుడూ ఏ సినిమా అంగీకరించలేదు. ఈ సినిమా కూడా అంతే. పాత్ర నచ్చి, నేను దాన్ని ఎంజాయ్ చేస్తానని అనిపిస్తే ఓకే అంటాను. ఒక్కసారి ఒప్పుకున్నాక ఆ పాత్ర  కోసం ఏమైనా చేస్తాను. ‘అ’లో పాత్ర కోసం నన్ను ఎంతగా మార్చుకున్నానో చూశారు కదా!
  •                 సక్సెస్‌‌ని, ఫెయిల్యూర్‌‌‌‌ని అర్థం చేసుకోవడానికి సినిమా పరిశ్రమను మించింది లేదు. ఇక్కడ ఏదైనా ప్రజల చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి దేనినైనా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండాలి. నా ఫెయిల్యూర్స్‌‌ నన్ను నేను అర్థం చేసుకోవడానికి పనికొచ్చాయి. నటిగా ఎదగడానికి నేనింకా ఏం చేయాలనేది తెలుసుకున్నాను. ఫీల్డ్​కి వచ్చినప్పటి నుంచి మంచి అవకాశాలను వినియోగించుకుంటూ ముందుకెళ్తున్నాను. పెద్ద సినిమాలు రానంత మాత్రాన నా కెరీర్ అయిపోయినట్టు కాదు.  బోలెడంత ఫ్యూచర్ ఉంది.
  •                 ఇండస్ట్రీలో బోల్డ్ అన్న పదాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. బోల్డ్‌‌నెస్‌‌కి వల్గారిటీకి తేడా ఉంది. రెండింటి మధ్య ఓ సన్నని గీత ఉంటుంది. దాన్ని దాటనంత వరకూ ఓకే. వల్గారిటీకి నేను వ్యతిరేకం. క్లీన్ సినిమాలే చేస్తాను. ‘ఎవరు’
    చేయడానికి కారణం అదే. ఇదొక క్లీన్ మూవీ.
  •                 తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నాను. మరొకటి లైన్‌‌లో ఉంది.  తెలుగులో ప్రస్తుతానికి ఇదొక్కటే. కొన్ని అవకాశాలైతే ఉన్నాయి. బాలీవుడ్‌‌లో కూడా చర్చలు నడుస్తున్నాయి.  కన్‌‌ఫర్మ్ అయ్యాక అన్ని ప్రాజెక్టుల వివరాలూ చెబుతాను.
  • ‘అ’ మూవీకి నేషనల్ అవార్డు వచ్చిందని నాని మెసేజ్ చేయగానే చాలా సంతోషమేసింది. ఆ సినిమాలో నా ఒళ్లంతా టాటూలు  ఉంటాయి. దాంతో మేకప్‌కే ఇరవై నాలుగ్గంటలు పట్టింది. నాలుగు రోజుల వరకూ స్నానం చేయ డానికి కూడా లేదు. అంతగా కష్టపడిన సినిమాకి అవార్డు వచ్చిందంటే అంతకంటే ఆనందం ఇంకేముంటుంది!