ఎన్నికల్లో కాంగ్రెస్​కే మా మద్దతు : దుండ్ర కుమారస్వామి

ఎన్నికల్లో కాంగ్రెస్​కే మా మద్దతు : దుండ్ర కుమారస్వామి
  •     జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు కుమారస్వామి

బషీర్ బాగ్, వెలుగు: సామాజిక న్యాయం కాంగ్రెస్​ పార్టీతోనే సాధ్యమని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి చెప్పారు. జనాభా ప్రకారం అన్ని హక్కులు పొందాలంటే కులగణన చేయాలన్నారు. సోమవారం కాచిగూడలో జాతీయ బీసీ దళ్ ఆధ్వర్యంలో కుల సంఘాల అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. బీసీ కుల సంఘాల అధ్యక్షులు, విద్యార్థి నాయకులు, న్యాయవాదులు, మేధావులు పాల్గొన్నారు.

బడుగు బలహీన వర్గాల అభివృద్ధి, సంక్షేమం గురించి కాంగ్రెస్​ ఆలోచిస్తుందని, కులగణన చేయాలనుకోవడం చారిత్రాత్మక నిర్ణయమని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. రాజ్యాధికారం దక్కే వరకు బీసీలు పోరాడాలని కుమారస్వామి పిలుపిచ్చారు. కేంద్రంలోని బీజేపీ బీసీలకు అన్యాయం చేస్తోందన్నారు. జాతీయ బీసీ దళ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేంద్ర బాబు, న్యాయవాది వడ్డేమని శ్రీనివాస్, ప్రొఫెసర్ కేశవ్, సాయి యాదవ్, కుల సంఘ నేతలు పాల్గొన్నారు.