ఆ ఒక్క రోజే ఆఫర్ : మల్టీఫ్లెక్స్ థియేటర్లలో టికెట్ రూ.99 మాత్రమే

ఆ ఒక్క రోజే ఆఫర్ : మల్టీఫ్లెక్స్ థియేటర్లలో టికెట్ రూ.99 మాత్రమే

సినిమా అనేది ఆడియన్స్ కు ఎంటర్టైన్ మెంట్ కలిగించేది. మల్టిప్లెక్స్ కి..నార్మల్ థియేటర్స్ కి టికెట్స్ రేటులో చాలా తేడా ఉంటుందని తెలిసిందే. అంతేకాకుండా థియేటర్స్ లో ఇంటర్వెల్ టైములో పాప్ కాన్ ,వాటర్ బాటిల్స్ రేట్ ను వీపరీతంగా పెంచడం వల్ల ఆడియన్స్ తగ్గిపోతూ వస్తున్నారు.

అలా ప్రసెంట్ ఆడియన్స్..థియేటర్స్ లో కాకుండా ఓటీటీ లో సినిమాలు చూడటానికి అలవాటు పడుతున్నారు. దీంతో ప్రతి సంవత్సరం థియటర్స్ యాజమాన్యం నేషనల్ మూడీ డే(National Movie Day) స్పెషల్ గా పలు ఆఫర్స్ ని తీసుకురావడం జరుగుతుంది. 

2023  సంవత్సరంకి గాను..నేషనల్ మూడీ డే (అక్టోబర్ 13న) సందర్భంగా టికెట్ రేట్లను తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆ ఒక్క రోజున ఏ సినిమాకైనా 99 రూపాయలకే టికెట్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు మల్టీప్లెక్స్ అసోసియేషన్ వారు.

నేషనల్ వైడ్ గా ఉన్న మల్టీ ప్లెక్స్ లతో పాటుగా మరిన్ని థియేటర్లకు ఈ ఆఫర్ వర్తించనుంది. ఈ సారి దాదాపు 4000 థియేటర్లు ఈ ఆఫర్ ను ఇవ్వనున్నట్టు సమాచారం. గత సంవత్సరం స్పెషల్ షోస్ నిర్వహించగా 65 లక్షల టికెట్స్ అమ్ముడవ్వగా..మరి ఈ సారి అంతకు రెట్టింపు టికెట్స్ అమ్ముడవ్వడమే లక్షంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. 

ఇందుకు గాను PVR INOX, Cinepolis, Miraj, Citypride, Asian, Mukta A2, Movie Time, Wave, M2K, Delite మరియు అనేక ఇతర థియేటర్లు జాతీయ సినిమా దినోత్సవంలో భాగంగా ఉన్నాయి. అలాగే సీజ్ చేసిన థియేటర్లను కూడా తిరిగి తెరవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 

ఈ గొప్ప అవకాశం ప్రకటించడంతో సినీ లవర్స్ కు పండగే అనే చెప్పుకోవాలి. అందులోనూ అక్టోబర్ నెలలో పలు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ ఆఫర్ తో ఒకే రోజు మూడు నాలుగు సినిమాలు చూసేయ్యొచ్చు అని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. 

అలాగే బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్నిఅందుకున్న సినిమాలకు విషెస్ తెలియాజేస్తూ..ఈ స్పెషల్ షోస్ చూడటానికి అన్ని వయస్సుల ప్రేక్షకులు ఆహ్వానం. అలాగే  బాక్సాఫీస్ విజయాలకి సహకరించిన సినీ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు..మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పేర్కోంది.