
- లేకుంటే డేటా మీ దగ్గర లేదని భావించాల్సి వస్తది
- రాష్ట్ర ప్రభుత్వానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ డెడ్‌లైన్
- గతంలో 20 రకాల డాక్యుమెంట్లు అడిగితే.. నాలుగే ఇచ్చారు
- అందులో ఒక రిపోర్టు పాక్షికంగానే అందజేశారని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైన మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను తమకు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నేషనల్డ్యామ్ సేఫ్టీ అథారిటీ కోరింది. ఆదివారంలోగా తాము కోరిన అన్ని డాక్యుమెంట్లు సమర్పించాలని డెడ్‌లైన్ విధించింది. ఒకవేళ తాము అడిగిన సమాచారం ఇవ్వకుంటే.. ఈ డేటా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదని భావించాల్సి వస్తుందని స్పష్టం చేసింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ గేట్స్ డిజైన్ డైరెక్టర్ రాహుల్ కుమార్ ఈ మేరకు స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి లేఖ రాశారు.
మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాకులో ఆరు పిల్లర్లు కుంగిపోయి అప్రోచ్‌బ్రిడ్జి కిందికి కుంగిన విషయం తెలిసిందే. నేషనల్డ్యామ్సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలోని ఇంజనీర్ల బృందం ఈనెల 24న బ్యారేజీని సందర్శించి, 25న జలసౌధలో ఈఎన్సీలు, ఇతర ఇంజనీర్లతో భేటీ అయ్యింది. తాజాగా సమాచారం ఇవ్వాలంటూ లేఖ రాసింది. తాము మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన 20 రకాల డాక్యుమెంట్లు ఇవ్వాలని కోరితే రాష్ట్ర ప్రభుత్వం మూడు డాక్యుమెంట్లు మాత్రమే అందజేసిందని లేఖలో పేర్కొంది. ఇంకో రిపోర్టును పాక్షికంగా మాత్రమే ఇచ్చారని చెప్పింది.
కొన్ని డ్రాయింగ్స్ఇచ్చారు..
‘‘జియోలాజికల్ అండ్ జియోటెక్నికల్ డీటైల్స్ (బోర్ హోల్ లాగ్ డీటైల్స్, ఎస్పీటీ రిజల్ట్, ప్లేట్ లోడ్ టెస్ట్ రిజల్ట్ తదితర డాక్యుమెంట్లు).. డిజైన్క్యాలిక్యులేషన్ఆఫ్బ్యారేజీ, హైడ్రాలిక్ (సర్ఫేస్ అండ్ సబ్ సర్ఫేస్) అండ్ స్టెబిలిటీ, సేఫ్ ఎగ్జిట్ గ్రాడియెంట్ క్యాలిక్యులేషన్ డాక్యుమెంట్లు.. ఫిజికల్ మోడల్ స్టడీ రిపోర్టు మాత్రమే మాకు అందజేశారు. బ్యారేజీకి సంబంధించి కొన్ని డ్రాయింగ్స్ఇచ్చారు. మిగతా డ్రాయింగ్స్ ఇవ్వాల్సి ఉంది’’ అని లేఖలో రాహుల్ కుమార్ తెలిపారు. బ్యారేజీ ఇన్‌స్ట్రుమెంట్ డేటా (పీజోమీటర్, స్ట్రెస్ సెల్స్ తదితర వివరాలు), డీటైల్స్ ఆఫ్ ఆల్ డిస్ట్రెస్ కండిషన్స్ ఆఫ్ ది బ్యారేజీ, స్ట్రక్చర్ షోయింగ్ సెక్షనల్ డ్రాయింగ్స్, జియోలాజికల్ షోయింగ్ ప్రొఫైల్స్ సెక్షనల్ డ్రాయింగ్స్, వర్షాకాలం ప్రారంభానికి ముందు బ్యారేజీ తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలు, బ్యారేజీ ఫౌండేషన్ ఇంప్రూవ్మెంట్ వర్క్స్, క్వాలిటీ కంట్రోల్ రిపోర్టులు, థర్డ్ పార్టీ మానిటరింగ్ రిపోర్టులు, బ్యారేజీని ఉపయోగంలోకి తెచ్చిన నాటి నుంచి వర్షాకాలం ప్రారంభానికి ముందు, తర్వాత క్రాస్సెక్షన్స్, సౌండింగ్స్కు సంబంధించిన వివరాలు, బ్యారేజీకి ఎగువ, దిగువన సేకరించిన వివరాలు ఇవ్వాలని కోరారు.
కాంట్రాక్టర్‌తో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం డిఫెక్ట్ లయబులిటీకి సంబంధించిన వివరాలు, బ్యారేజీ ప్రతి బ్లాక్‌కు సంబంధించిన పూర్తి నివేదికలు, బ్యారేజీకి ఎగువ, దిగువకు సంబంధించిన ఫొటోలు, కుంగిన పిల్లర్లలో వచ్చిన పగుళ్లకు సంబంధించి ఫొటోలు, దిగువ నుంచి నిర్మించిన పిల్లర్లు.. వాటిని కనెక్ట్చేసే దానికి సంబంధించిన డ్రాయింగ్స్, ఏడో బ్లాక్‌లోని అన్ని గేట్ల కండిషన్, వాటి స్టాప్ లాగ్ గ్రూవ్స్ కండిషన్ఎలా ఉందనే పూర్తి సమాచారం తమకు సమర్పించాలని ఆదేశించారు. నేషనల్డ్యామ్సేఫ్టీ అథారిటీ లేఖ రాయడంతో ఈ డేటా సమకూర్చడంపై ఇరిగేషన్అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.
బ్యారేజీని పరిశీలించిన కేంద్ర బృందం..
మేడిగడ్డ బ్యారేజీ కుంగిన పిల్లర్లను కేంద్ర డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానల్ బృందం పరిశీలించింది. శనివారం కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ ఏబీ పాండ్య నేతృత్వంలో ఆరుగురుతో కూడిన బృందం బ్యారేజ్ వద్దకు చేరుకుని సుమారు 2 గంటలపాటు పరిశీలించింది.