ప్రమాదాలు తప్పించుకోండిలా..! : ఫైర్ సేఫ్టీ వారోత్సవాలు

ప్రమాదాలు తప్పించుకోండిలా..! : ఫైర్ సేఫ్టీ వారోత్సవాలు

ఎల్బీనగర్: జాతీయ అగ్నిమాపక దినోత్సవం సందర్భంగా తమ పరిధిలోని ఆసుపత్రులు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్ లో మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నామని రంగారెడ్డి జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీధర్ తెలిపారు. నేటి నుంచి 20 వ తేదీ వరకు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. 1944 ఏప్రిల్ 14వ తేదీన ముంబయి విక్టోరియా డాక్ యార్డ్ లో జరిగిన అగ్నిప్రమాదంలో విధి నిర్వహణలో ఉన్న 66మంది అగ్నిమాపక సిబ్బంది అమరులైనందుకు గుర్తుగా దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్14న అగ్నిమాపక దినోత్సవం నిర్వహించి వారోత్సవాలు నిర్వహిస్తా రు. డ్యూటీలో ఉండగా ప్రాణాలు కోల్పోయిన అగ్నిమాపక దళ సిబ్బందికి నివాళి అర్పించి, అగ్నిప్రమాదాలు జరగకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ చైతన్య పరచడం ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపరిధిలో 17ఫైర్ స్టేషన్ లు,24 ఫైర్ ఇంజన్లు ఉన్నాయన్నారు. వీటితో రంగారెడ్డి, వికారాబాద్,మేడ్చల్ జిల్లాల పరిధిలో సేవలు అందిస్తున్నట్లు వివరించారు.

ప్రమాదాలు తగ్గించడానికి అధికారులు చెప్తున్న సూచనలు ఇళ్లలో

  •  ఎల్ పీజీ వాడకం పూర్తయిన వెంటనే రెగ్యులేటర్ వాల్వు ఆపివేయాలి. గ్యాస్ లీకవుతున్నట్లు అనుమానం వస్తే వెంటనే రెగ్యులేటర్ వాల్స్​ఆఫ్చేయాలి. ఆ సమయంలో ఎలక్ట్రిక్ స్విచ్ లు ఆన్ చేయవద్దు.
  • చిన్న పిల్లలకు అగ్గిపెట్టెలు, లైటర్లు, టపాకాయలు ఇతర మండే వస్తువులు అందుబాటులోఉంచవద్దు.
  • కాల్చిన సిగిరెట్లు, బీడీలు, అగ్గిపుల్లలు ఆర్పకుండా పారవేయరాదు.
  • ఐఎస్ఐ ఎలక్ట్రికల్ వైరింగ్ పరికరాలనే ఉపయోగించాలి.
  • పాడైన వైర్లను వాడరాదు. ఓవర్ లోడ్వేయకుండా, ఎలక్ట్రికల్ సాకెట్ నందు దాని కెపాసిటికి తగ్గ ప్లగ్ వాడాలి.
  • దుస్తులకు నిప్పు అంటుకున్నట్లయితే పరుగెత్తవద్దు. నేలపై దొర్లాలి లేదా దుప్పటి చుట్టుకోవాలి. కాలిన శరీర భాగంమీద చల్లని నీరుపోయరాదు.
  • స్కూల్స్, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్ స్కూల్స్, షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్ నందు ఆర్సీసీ లేదా కాంక్రీట్ శ్లాబులను మాత్రమే పై కప్పుగా వాడాలి.స్కూల్స్, హాస్పిటల్స్ లో అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు క్షేమంగా తప్పించుకునేందుకు సరైన ప్రణాళికను రచించి, బొమ్మల రూపంలో అదిఅందరికి తెలిసేలా ఉంచాలి.
  • ఫైర్ అలారం, ఫైర్ స్మోక్ డిటెక్టర్లను అవసరమైన ప్రదేశాలలో ఏర్పాటు చేయాలి.
  • షాపింగ్ మాల్స్​లో ఎలక్ట్రికల్ సామగ్రినిఐఎస్ఐ మార్కు కలిగి న వాటిని మాత్రమేవాడాలి.

వికారాబాద్లో 

జిల్లాలోని అగ్నిమాపక శాఖ కార్యాలయంలో ఈ నెల 20వతే దీ వరకు అగ్నిమాపక శాఖ వారోత్సవాలు జరుగుతుందని అగ్నిమాపక శాఖ అధికారిఫయాజ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.వికారాబాద్ ఫైర్ స్టేషన్ పరిధిలోని అగ్ని ప్రమాదాలపై అవగాహన సదస్సులు బస్టాండ్, రైల్వేస్టేషన్, పార్కు, పాఠశాలలు, సినిమా థియేటర్లు, ఫంక్షన్ హాల్స్, ఆస్పత్రులు, గ్యాస్ గోడౌన్,పరిశ్రమలలో జరిగే ప్రమాదాలకు జరిగే జాగ్రత్తచర్యలు ఎలా తీసుకోవాలో అవగాహన కల్పిస్తామన్నారు.

జాగ్రత్తలతో ప్రమాదాల నివారణ

జీడిమెట్ల, వెలుగు: తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇళ్లు, పరిశ్రమలు, వ్యాపారసము దాయాల్లో అగ్నిప్రమాదాలు జరగకుండా చూసుకోవచ్చు. అగ్నిప్రమాదం జరగగానే ఆందోళన చెందవద్దు . వెంటనే అగ్నిమాపక పరికరాలతో మంటలను ఆర్పే ప్రయత్నం చేయాలి. ఎక్కువ సార్లు ఆందోళన వల్లనే నష్టం తీవ్రత పెరుగుతుంది. చిన్నాపాటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పెద్ద ప్రమాదాలు నివారిం చవచ్చు. ప్రజల్లో అవగాహన పెం చడం కోసం అగ్నిమాపక వారోత్సవాల్లో అన్ని వర్గా ల దగ్గరకు వెళ్లి నివారణచర్యల గురించి తెలియజేస్తాం. –సుభాష్ రెడ్డి,జీడిమెట్ల ఫైర్ ఆఫీసర్