
న్యూఢిల్లీ: అనేక సార్లు వాయిదా పడుతూ వస్తున్న నేషనల్ గేమ్స్‌ను గుజరాత్ వేదికగా ఈ ఏడాది సెప్టెంబర్–అక్టోబర్‌లో నిర్వహిస్తామని ఇండియన్ ఒలింపిక్ సంఘం (ఐఓఏ) సెక్రటరీ జనరల్ రాజీవ్ మెహతా బుధవారం ప్రకటించారు. గేమ్స్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు గుజరాత్ ఒలింపిక్ సంఘం, ఆ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గుజరాత్‌లోని ఐదారు నగరాల్లో పోటీలు నిర్వహిస్తామన్నారు. చివరి నేషనల్ గేమ్స్ (35వ) 2015లో కేరళలో జరిగాయి. ఆ తర్వాతి గేమ్స్‌కు 2016లో గోవా ఆతిథ్యం ఇవ్వాల్సింది. కానీ, అప్పటి నుంచి గేమ్స్ అనేక సార్లు వాయిదా పడ్డాయి.