రిజర్వేషన్ల సాధనకు జాతీయ స్థాయిలో ఉద్యమం..తెలంగాణ బీసీ జేఏసీ కో చైర్మన్ దాసు సురేశ్

రిజర్వేషన్ల సాధనకు జాతీయ స్థాయిలో ఉద్యమం..తెలంగాణ బీసీ జేఏసీ కో చైర్మన్ దాసు సురేశ్

బషీర్​బాగ్, వెలుగు: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో పాటు చట్టసభల్లో రిజర్వేషన్ల సాధన కోసం జాతీయ స్థాయిలో ఉద్యమిస్తామని తెలంగాణ బీసీ జేఏసీ కో చైర్మన్​ దాసు సురేశ్​ అన్నారు. నవంబర్ 2న బంజారాహిల్స్​లో తెలంగాణ బీసీ జేఏసీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

బుధవారం కాచిగూడలో జేఏసీ చీఫ్​ కోఆర్డినేటర్ గుజ్జ కృష్ణ, కోఆర్డినేటర్ కులకచర్ల శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో విస్తృత స్థాయి సమావేశం వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విస్తృతస్థాయి  సమావేశానికి బీసీ జేఏసీ చైర్మన్  ఆర్.కృష్ణయ్య, వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పలు బీసీ సంఘాల నేతలు కోల జనార్ధన్, నందగోపాల్, సరస్వతి, బండారు పద్మావతి, జ్యోతి, మిరియాల శ్రీలత, నాగుల కనకయ్యగౌడ్, చిన్నరాములు, ప్రొఫెసర్ పురుషోత్తం, సాయికుమార్ తదితరులు  పాల్గొన్నారు.