- సెయిలింగ్ వీక్ టీ షర్ట్ ఆవిష్కరణ
హైదరాబాద్, వెలుగు : హుస్సేన్‌సాగర్ లో జులై–1 నుంచి నేషనల్ లెవల్ సెయిలింగ్ పోటీలు జరగనున్నాయి. సెయిలింగ్వీక్కు సంబంధించిన టీషర్ట్ ను ఈవీడీఎం కమిషనర్ ఏవీ రంగనాథ్ శుక్రవారం బుద్ధభవన్‌లోని తన ఆఫీసులో ఆవిష్కరించారు. జులై 7న నిర్వహించే బహుమతుల ప్రదానోత్సవానికి తప్పనిసరిగా రావాలని ఆర్మీ మేజర్ కిరణ్ ఆధ్వర్యంలో ఆర్మీ అధికారుల బృందం
మేముసైతం మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ భాస్కర్, గమన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నందకిశోర్, బయాన్ కంపెనీ మార్కెటింగ్ జీఎం ముంగి గిరిధర్ రంగనాథ్ ను కోరారు. రంగనాథ్‌ను కలిసిన వారిలో సుబేదార్ సాయిరామ్, సుధాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
