ఓయూలో జాతీయస్థాయి టెక్నికల్ ఫెస్ట్ షురూ

ఓయూలో జాతీయస్థాయి టెక్నికల్ ఫెస్ట్ షురూ

ఓయూ,వెలుగు :  ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో వివిధ విభాగాల్లో  వేర్వేరు పేర్లతో జాతీయస్థాయి టెక్నికల్ ఫెస్టివల్(సింపోజియం) శుక్రవారం షురువైంది. విద్యార్థులు పలు విభాగాల్లో పోటీ పడ్డారు. రెండు రోజుల నిర్వహించే సింపోజియంలో తమ ప్రతిభను ప్రదర్శించేందుకు రాష్ట్రవ్యాప్తంగా పలు కాలేజీల నుంచి విద్యార్థులు భారీగా తరలివచ్చారు. దీంతో వర్సిటీ సందడి నెలకొంది.

బయో మెడికల్ ఇంజనీరింగ్ కాలేజీలో మెడిటెక్ ను హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ఐఏఎస్ ఆర్ వీ కర్ణన్, మెడిసిన్ మెడికల్ ప్రోడక్ట్స్ ఖుస్రూ వాకిల్,  మెకానికల్ ఇంజనీరింగ్ కాలేజీలో మెకరీనా సింపోజియంను భారత్ ఫోర్జ్ లిమిటెడ్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ ఫణికౌండిన్య, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు టెక్సోనెన్స్ సింపోజియంను టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ, ఐఏఎస్ అధికారి ముషారఫ్ అలీ ఫరూఖీ ప్రారంభించి మాట్లాడారు.