సబ్బండ వర్గాల పక్షాన పోరాడుతున్నం : పల్లా వెంకట్ రెడ్డి

సబ్బండ వర్గాల పక్షాన పోరాడుతున్నం : పల్లా వెంకట్ రెడ్డి
  • సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్​ రెడ్డి 


హైదరాబాద్, వెలుగు: ప్రజలు, కార్మికులు, విద్యార్థులు ఇలా సబ్బండ వర్గాల పక్షాన పోరాడుతున్న పార్టీ సీపీఐ మాత్రమేనని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్​లోని హిమాయత్​నగర్​మక్దూం భవన్​లో అరసం, ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో సీపీఐ వందేండ్ల ఉత్సవాల సందర్భంగా రాష్ట్రస్థాయి కవులు, కళాకారులకు రెండ్రోజుల పాటు శిక్షణ తరగతులు జరిగాయి. 

ఈ సందర్భంగా ఆదివారం నిర్వహించిన ముగింపు సభలో  పల్లా వెంకట్​రెడ్డి మాట్లాడారు. సీపీఐకి చెందిన రావి నారాయణ రెడ్డి, మక్దూం మొయినుద్దీన్, బద్దం ఎల్లా రెడ్డి వంటి అనేకమంది నిజాంకు వ్యతిరేకంగా భూ పోరాటాలు, భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు చేశారని తెలిపారు. భారత కమ్యూనిస్టు పార్టీ  ‘‘వందేండ్ల చరిత్ర’’ ను తెలియజేయడానికి ఆదిలాబాద్ జిల్లాలోని జోడె ఘాట్, బాసర, గద్వాల నుంచి మూడు జాతలను నిర్వహించనున్నట్టు చెప్పారు. 

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చాడ వెంకట్ రెడ్డి,  ప్రజానాట్య మండలి ఇన్ చార్జ్, పార్టీ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యుడు కలవేని శంకర్, ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహ,  సీపీఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈ.టీ.నరసింహ 
తదితరులు పాల్గొన్నారు.