పుష్ప-2 మూవీపై రియాక్ట్ అయిన.. నేషనల్ స్టార్ అల్లు అర్జున్

పుష్ప-2 మూవీపై రియాక్ట్ అయిన.. నేషనల్ స్టార్ అల్లు అర్జున్

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌(Allu arjun)కు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు(National award) అందుకున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన 69వ జాతీయ అవార్డ్స్(69th National awards) లో పుష్ప సినిమాకు గాను ఆయన ఈ అవార్డు సొంతం చేసుకున్నాడు. లేటెస్ట్ గా అల్లు అర్జున్ పుష్ప-2 మూవీ ఎలా వుండబోతుందనే విషయాలను షేర్ చేసుకున్నారు.  

పుష్ప-2 కోసం ఎన్నో మారుమూల ప్రాంతాలలోకి వెళ్లి..అక్కడ ఉండే ప్రజల స్థితి గతులను తెలుసుకుని..ఎంతో ప్రామాణికమైన విలువలతో పుష్ప-2 స్టోరీని రెడీ చేశారు డైరెక్టర్ సుకుమార్(Sukumar). ఇందుకోసం చాలా రీసెర్చ్ చేశాం.మన లోకల్ స్టోరీని..గ్లోబల్ స్టోరీగా తీసుకురావడానికి అహర్నిశలు పుష్ప టీం వర్క్ చేస్తుంది. ఇక పుష్ప-2 మూవీ వరల్డ్ లెవెల్లో తగ్గేదేలే అన్నట్టు ఉంటుందని..అల్లు అర్జున్ పేర్కోన్నారు.అలాగే ఈ మూవీలో భారీ ట్విస్టులతో కూడిన కంటెంట్ ను రెడీ చేసినట్టు తెలిపారు.అలాగే అల్లు అర్జున్ నేషనల్‌ అవార్డు అందుకోవడంతో పుష్ప-2 మూవీపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. 
  
ఇక పుష్ప-2 మూవీలో ఇంటర్నేషనల్ స్మగ్లర్ గా ఎదిగిన పుష్ప రాజ్ ను ఢీ కొట్టడం కోసం భన్వర్ సింగ్ షెకావత్ ఎంతకైనా తెగించే పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. సుకుమార్ క్లైమాక్స్ ను మరింత ఆసక్తికరంగా ప్లాన్ చేసినట్లుగా టాక్. అలాగే పుష్ప 2 ది రూల్ లోని కీలకపాత్రలతో పాటు..కొత్త పాత్రలు కూడా పరిచయం కానున్నట్లు తెలుస్తోంది.

పుష్ప పార్ట్ 1 లో బ‌న్నీ స్టైల్‌, మేన‌రిజ‌మ్, సాంగ్స్‌, డాన్సులు అన్నీ తెగ పాపుల‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే. దీంతో పాన్ ఇండియా రేంజ్‌లో ఆడియెన్స్ అంద‌రూ పుష్ప 2 ది రూల్ సినిమా కోసం ఆస‌క్తిగా ఎదురు చూడ‌సాగారు.ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా..మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.