రష్యా తక్షణం యుద్ధం ముగిచాలె

రష్యా తక్షణం యుద్ధం ముగిచాలె

ఉక్రెయిన్ లో సైనిక చర్యలను ముగించాలని వెంటనే తన బలగాలన్నింటినీ వెనక్కి రప్పించాలని నాటో చీఫ్ జెన్స్ స్టోలెన్ బర్గ్ కోరారు. తమకు యుద్ధంలో నేరుగా పాల్గొనాలనే ఆలోచన లేదని, ఉక్రెయిన్ కు మద్దతుగా నాటో తన దళాలను పంపబోదని ఆయన స్పష్టం చేశారు. నాటో అనేది ఆత్మ రక్షణ కోసం ఏర్పడిన దళమని, రష్యాతో తాము కొట్లాడాలని కోరుకోవడం లేదని అన్నారు. అయితే రష్యా తక్షణం యుద్ధం ఆపేసి, ఉక్రెయిన్ లో ఉన్న తన బలగాలను పూర్తిగా వెనక్కి తీసుకోవాలని కోరారు. సంక్షోభాన్ని పరిష్కరించేందుకు దౌత్య పరమైన చర్యలు చేపట్టాలని, చర్చలపై నమ్మకం ఉండాలని జెన్స్ సూచించారు.  

రష్యాతో యుద్ధంలో భీకరంగా పోరాడుతున్న ఉక్రెయిన్ కు అనేక అమెరికా సహా పలు యూరోపియన్ దేశాలు ఆయుధాలు పంపుతున్న నేపథ్యంలో రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ అణ్వాయుధాలను యాక్టివ్ కండిషన్ లో పెట్టాలంటూ తన సైన్యాన్ని ఆదేశించారు. ఈ నేపథ్యంలో యూరప్ భద్రతపై చర్చించేందుకు నాటో చీఫ్ జెన్స్ ఇవాళ పోలెండ్ ఆండ్రజెజ్ డుడాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జెన్స్ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ నాటో తమ సభ్య దేశాల రక్షణకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని అన్నారు. అయితే ప్రస్తుతం అణ్వాయుధాల స్టేటస్ లో ఏ మార్పులూ చేయాల్సిన అవసరం లేదన్నారు.