
రైతులకు ప్రకృతి సేద్యంపై ఉచితంగా శిక్షణా కార్యక్రమం నిర్వహించనుంది సచ్చితానంద యోగా మిషన్. ఇందుకోసం శంకర్ పల్లిలో రైతుల శిక్షణ భవనాన్ని ఈ నెల 26న ప్రారంభించనున్నారు. కల్టివేటింగ్, పరిశోధన వంటి వాటిపై ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తామని తెలిపారు ఆర్గనైజింగ్ సెక్రటరీ ధర్మతేజ. చిన్నారులకు ఉచిత విద్య, బోజన వసతితో పాటు గోవుల సంరక్షణపై శిక్షణ ఇస్తామన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ రాజ్యసభ సభ్యులు బస్వరాజ్ పాటిల్ హాజరుతున్నట్లు తెలిపారు.