జలవిహార్ లో నవకర్ నవరాత్రి ఉత్సవ్.. ఈ నెల 22 నుంచి అక్టోబర్ 1 వరకు

జలవిహార్ లో నవకర్ నవరాత్రి ఉత్సవ్.. ఈ నెల 22 నుంచి అక్టోబర్ 1 వరకు

ట్యాంక్ బండ్, వెలుగు: నెక్లెస్ రోడ్డులోని జలవిహార్ వేదికగా నవకర్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవ్- 2025 పేరిట సీజన్ 8 వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు కవిత, సలోని జైన్ తెలిపారు. మనేపల్లి జ్యువెలర్స్, అన్విత సహకారంతో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్​1 వరకు ఈ వేడుకలు జరుగుతాయన్నారు.

 ఆదివారం జలవిహార్​లో బాలీవుడ్ గర్బా కొరియోగ్రాఫర్ జిగర్ సోనీ, గుజరాతీ సోషల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు జిగ్నేష్ దోషీ, అన్విత, అచ్యుత్ రావు, మనేపల్లి జ్యువెలర్స్ గోపీ కలిసి ఎంట్రీ పాస్ పోస్టర్​ను ఆవిష్కరించారు. యువతులకు గర్బా, దాండియా నృత్యంపై జిగర్ సోనీ వర్క్​షాప్ నిర్వహించారు. ఈ ఉత్సవంతో ప్రతిరోజు మహా ఆర్తి,  వైవిధ్యమైన ఫుడ్ కోర్ట్, సెలబ్రిటీ సందర్శనలు, బహుమతులు ఉంటాయని  నిర్వాహకులు పేర్కొన్నారు.