నవీన్ చంద్ర, దివ్య పిళ్లై జంటగా కరుణ కుమార్ రూపొందించిన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ హనీ’. రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మించారు. ఫిబ్రవరి 6న సినిమా విడుదల కానుంది. ఆదివారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా నవీన్ చంద్ర మాట్లాడుతూ ‘ఇది ఆలోచన రేకెత్తించే సినిమా. ఆనంద్ అనే ఇంటెన్సిటీ ఉన్న క్యారెక్టర్ చేశా. మాకు ఉన్న బడ్జెట్‌లో ఆడియెన్స్‌కి డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వాలని ప్రయత్నించాం’ అని చెప్పాడు.
ఇది చాలా కొత్త కథ అని, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుందని హీరోయిన్ దివ్య పిళ్లై చెప్పింది. డైరెక్టర్ కరుణ కుమార్ మాట్లాడుతూ ‘మనిషి మెదడు కంటే పెద్ద దెయ్యం లేదనేది ఈ సినిమా కాన్సెప్ట్. ఇదొక ఫ్యామిలీ స్టోరీ. ఇందులో పిల్లి మాయ అనే ఒక వస్తువుని శోధించి సాధించే ఒక వ్యక్తి జీవితం చూపించాం. మెదడు అంతా చీకటి ఉన్న మనసుల మధ్య జరిగిన ఒక కథ. నిజ జీవిత సంఘటన నుంచి స్ఫూర్తిగా తీసుకుని దీన్ని రూపొందించా’ అని అన్నాడు. నటులు రాజా రవీంద్ర, దివి పాల్గొన్నారు.
