97శాతం మార్కులొచ్చినా మెడికల్ సీటు రాలే

97శాతం మార్కులొచ్చినా మెడికల్ సీటు రాలే

ఉక్రెయిన్లో రష్యా జరిపిన దాడిలో భారత విద్యార్థి నవీన్ శేఖరప్ప మరణంతో అతని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. వైద్య విద్య అభ్యసించేందుకు వెళ్లి బాంబు దాడిలో మృత్యువాతపడ్డ కొడుకును తలుచుకుని అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కర్నాటకకు చెందిన నవీన్ మరణంపై తాజాగా అతని తండ్రి స్పందించారు. మీడియా ముందు తన ఆవేదన బయటపెట్టారు. మెడిసిన్ సీటు కోసం భారత్ లో కోట్లు అడిగారని అంత మొత్తం చెల్లించలేకే కొడుకును ఉక్రెయిన్ పంపినట్లు చెప్పారు. 

నవీన్కు ఇంటర్లో 97శాతం మార్కులు వచ్చినా కర్నాటకలో అతనికి మెడికల్ సీటు రాలేదు. ఎంబీబీఎస్లో అడ్మిషన్ కోసం కాలేజీలు కోటి రూపాయల వరకు డిమాండ్ చేశాయి. అంతకన్నా చాలా తక్కువ వ్యయంతోనే విదేశాల్లో వైద్య విద్య అభ్యసించే అవకాశముండటంతో తన కొడుకును ఉక్రెయిన్ పంపినట్లు నవీన్ తండ్రి చెప్పారు. కానీ యుద్ధంలో తన కొడుకును కోల్పోతానని తాను ఊహించలేదని కన్నీటి పర్యంతమయ్యారు. 

మరిన్ని వార్తల కోసం..

యూపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం

రష్యాకు దీటుగా బదులిస్తున్న ఉక్రెయిన్