సైమా బెస్ట్ యాక్టర్ అవార్డ్..నవీన్ పొలిశెట్టి ఎమోషనల్

సైమా బెస్ట్ యాక్టర్ అవార్డ్..నవీన్ పొలిశెట్టి ఎమోషనల్

సైమా అవార్డ్స్ ఈవెంట్ బెంగళూరులో అట్టహాసంగా జరిగింది. క్రిటిక్స్ విభాగంలో బెస్ట్ యాక్టర్గా నవీన్ పొలిశెట్టి అవార్డు గెలుచుకున్నారు. జాతిరత్నాలు మూవీ మొత్తం 8 విభాగాల్లో నామినెట్ అయ్యింది. ఈ అవార్డు రావడం పట్ల నవీన్ ఎమోషనల్ అయ్యారు. ‘‘సగటు మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఓ చిన్నపిల్లవాడికి నటుడు కావాలనేది కల. ఇప్పుడు ఆ కల నిజమైంది. ఈ రోజు ఆ పిల్లవాడు తన మొదటి బెస్ట్ యాక్టర్ అవార్డును గెలుచుకున్నాడు. కష్టాలబాటలో నడవడానికి సిద్ధంగా ఉంటే..ఆకలితో ఉన్న రోజులు, నిద్రలేని రాత్రులతో పాటు బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా ఉంటుంది’’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.  

టాలీవుడ్ నుంచి పుష్ప మూవీ అత్యధిక అవార్డులను కొల్లగొట్టింది. ఉత్తమ సినిమాతోపాటు బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్, బెస్ట్ డైరెక్టర్ గా సుకుమార్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా దేవి శ్రీ ప్రసాద్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా జగదీష్ ప్రతాప్ బండారి, బెస్ట్ లిరిసిస్ట్ చంద్రబోస్  సహా పలువురు అవార్డులను అందుకున్నారు. పుష్ప మూవీ 12 కెటగీరీల్లో నామినెట్ అవ్వగా..అఖండ మూవీ 10 కేటగిరీల్లో నామినెట్ అయ్యింది.