శిల్పారామంలో కనుల పండువగా నవరాత్రి వేడుకలు

శిల్పారామంలో కనుల పండువగా నవరాత్రి వేడుకలు

మాదాపూర్ వెలుగు: మాదాపూర్​ శిల్పారామంలో నవరాత్రి ఉత్సవాలు కనులపండువగా కొనసాగుతున్నాయి.  బతుకమ్మ, దసరా ఉత్సవాల్లో భాగంగా శిల్పారామానికి తరలివచ్చే సందర్శకులతో సందడిగా మారింది.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా  శారీ మేళా సందర్శకులను ఆకట్టుకుంటున్నది. 

కల్చరల్ ప్రోగ్రామ్స్​లో భాగంగా మంగళవారం రేణుక ప్రభాకర్ శిష్య బృందం ప్రదర్శించిన దక్ష యజ్ఞ అష్టాదశ శక్తి పీఠాలు కూచిపూడి,  అర్చన మిశ్రా, సోనాల్ శిష్య బృందం ప్రదర్శించిన కథక్ నృత్యం అలరించింది.