దేశ సేవ చేయాలనుకునేవారికి అగ్నిపథ్ గొప్ప అవకాశం

దేశ సేవ చేయాలనుకునేవారికి అగ్నిపథ్ గొప్ప అవకాశం
  • అగ్నిపథ్ ను యువత సరిగ్గా అర్థం చేసుకోలేదు
  • దేశం కోసం... దేశంలో రూపొందిన గొప్ప పథకం
  • యువత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
  • నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్

న్యూఢిల్లీ: దేశ సేవ చేయాలనుకునే యువతకు అగ్నిపథ్ గొప్ప అవకాశమని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ స్పష్టం చేశారు. అగ్నిపథ్ స్కీంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తున్న తరుణంలో ఆయన స్పందించారు. అగ్నిపథ్ స్కీంపై అల్లర్లు చెలరేగుతాయని అసలు అనుకోలేదని ఆయన అన్నారు. అగ్నిపథ్ స్కీంపై యువకులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సంయమనంతో ఉండాలని కోరారు. ఏడాదిన్నరపాటు ఎంతో కష్టపడి స్కీంను రూపొందించామన్నారు.  దేశం కోసం... దేశంలో రూపొందించిన గొప్ప స్కీం అగ్నిపథ్ అని తెలిపారు. భారత సైన్య చరిత్రలో మానవ వనరుల వినియోగంలో అగ్నిపథ్ స్కీంను అతిపెద్ద సంస్కరణగా పేర్కొన్న ఆయన...  స్కీంలోని విషయాలను యువత సరిగ్గా అర్థం చేసుకోలేదని అభిప్రాయపడ్డారు.