గోవాలో కూలిన నేవీ శిక్షణా విమానం

గోవాలో కూలిన నేవీ శిక్షణా విమానం

పైలట్లు ట్రైనింగ్‌లో ఉన్న శిక్షణా విమానం సౌత్ గోవాలో శనివారం మధ్యాహ్నం కూలిపోయింది. ట్రైనింగ్‌లో భాగంగా దబోలిం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరిన విమానం కాసేపటికే కూలిపోయింది. పైలట్లు షియోఖండ్, లెఫ్టినెంట్ కమాండర్ దీపక్ యాదవ్ ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఇంజన్లో మంటలు రావడం వల్లే మిగ్ 29 కూలినట్లు అధికారులు తెలిపారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రకటించారు. కూలిన మిగ్ 29 విమానం ఫైటర్ జెట్‌కు ట్రైనర్ వెర్షన్.