క సినిమాలో మా పాత్రలు కీలకం : నయన్ సారిక, తన్వీ

క సినిమాలో మా పాత్రలు కీలకం : నయన్ సారిక, తన్వీ

కిరణ్ అబ్బవరం హీరోగా నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్‌‌గా నటించిన చిత్రం ‘క’. సుజీత్, సందీప్ దర్శకత్వంలో చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మించారు. ఈనెల 31న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరోయిన్స్ చెప్పిన విశేషాలు.  నయన్ సారిక మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో నేను సత్యభామ పాత్ర పోషించా. గతంలో నేను చేసిన ‘గం గం గణేశా’ చిత్రంలో మోడర్న్‌‌గా కనిపిస్తే, ‘ఆయ్’లో ట్రెడిషనల్‌‌గా నటించా. ఇందులో నా రోల్ చాలా పద్ధతిగా ఉంటుంది. -పీరియాడిక్ బ్యాక్‌‌డ్రాప్ కావడంతో నా పాత్ర కోసం సావిత్రి గారి లుక్‌‌ను రిఫరెన్స్‌‌గా తీసుకున్నారు. 

 కిరణ్ అబ్బవరంతో కలిసి పనిచేయడం హ్యాపీగా ఉంది. ఆయన ఈ ప్రాజెక్ట్‌‌లో ఎంతో ఇన్వాల్వ్ అయ్యారు.  ప్రతి క్రాఫ్ట్ నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకునేవారు. యాక్షన్  సీక్వెన్స్‌‌ ఒరిజినల్‌‌గా చేశారు. ఈ కథలో ఎన్నో ట్విస్ట్స్ అండ్ టర్న్స్ ఉన్నాయి.  కథ విన్నప్పుడు  క్లైమాక్స్ మనసులో గుర్తుండిపోయింది. ప్రేక్షకులు సరికొత్త అనుభూతిని పొందుతారు.  మా టీమ్ అంతా సక్సెస్‌పై నమ్మకంతో ఉన్నాం’ అని చెప్పింది.  

తన్వీ రామ్ మాట్లాడుతూ ‘సినిమా సెలెక్ట్ చేసుకునే ముందు నా క్యారెక్టర్ కథలో ఎంత కీలకంగా ఉందనేది చూసుకుంటాను. ఈ కథలోనూ మా పాత్రలు చాలా కీలకంగా ఉంటాయి. ఇందులో రాధ అనే స్కూల్ టీచర్  క్యారెక్టర్ చేశా. అభినయ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం), సత్యభామ (నయన్)  ఒక టైమ్ ఫ్రేమ్‌‌లో కనిపిస్తే, నేను మరో పీరియడ్‌‌లో కనిపిస్తా.  నా పాత్రకు వారి పాత్రలకు మధ్య కనెక్షన్ ఇంటరెస్టింగ్‌‌గా ఉంటుంది. ఈ సినిమాకు సెకండ్ పార్ట్  లీడ్ ఉంటుంది. కానీ సీక్వెల్ గురించి తర్వాత చెబుతాం’ అని చెప్పింది.