జవాన్ నుండి లీకైన నయన్ లుక్.. వైరల్ అవుతున్న వీడియో

జవాన్ నుండి లీకైన నయన్ లుక్.. వైరల్ అవుతున్న వీడియో

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్(Shah rukh khan) హీరోగా వస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ "జవాన్(Jawan)". తమిళ దర్శకుడు అట్లీ కుమార్(Atlee kumar) తెరకెక్కిస్తున్న ఈ సినిమాను రెడ్ చిల్లీస్(Red chillies) పతాకంపై షారుక్ భార్య గౌరీ ఖాన్(Gowry khan) నిర్మిస్తన్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanathara) ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గా పఠాన్(Patan) సినిమాతో వెయ్యి కోట్లు కొల్లగొట్టిన షారుక్ నుండి వస్తున్న మూవీ కావడంతో.. జవాన్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకే ఈ సినిమా కోసం షారుక్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఇక తాజాగా ఈ సినిమా టీజర్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. జవాన్ టీజర్(Jawan teaser) జులై 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే టీజర్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న సమయంలో.. ఈ సినిమా నుండి ఒక వీడియో లీకై సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో హీరోయిన్ నయనతార కు సంబందించిన క్లిప్ లీకైంది. పింక్ సూట్ లో ఉన్న నయనతార లుక్నెక్స్ట్ లెవల్లో ఉంది. చాలా అట్రాక్టీవ్ గా కనిపిస్తున్న ఈ పిక్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

ఇక జవాన్ సినిమా సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సినిమా నుండి రిలీజైన పోస్టర్స్ అండ్ వీడియోస్ కు ఆడియన్స్ నుండి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్(Anirudh) సంగీతం అందిస్తున్న ఈ సినిమా.. షారుక్ కు ఎలాంటి రిజల్ట్ ఇవ్వనుందో చూడాలి.