Nayanthara Vs Doctor: మందార టీపై నయన్ ఒపీనియన్..8.7 మిలియన్ల ఫాలోవర్స్‌ను తప్పుదోవ పట్టిస్తుందంటూ ఓ డాక్టర్ ఆగ్రహం

Nayanthara Vs Doctor: మందార టీపై నయన్ ఒపీనియన్..8.7 మిలియన్ల ఫాలోవర్స్‌ను తప్పుదోవ పట్టిస్తుందంటూ ఓ డాక్టర్ ఆగ్రహం

స్టార్ హీరోయిన్ నయనతార (Nayanthara) తన ఇన్‌స్టా వేదికగా పెట్టిన తాజా పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మందార టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చెబుతూ ఇటీవలే నయనతార ఓ పోస్ట్ చేసింది.

నయనతార తన హెల్త్ కేర్ ఎక్స్‌పర్ట్ మున్మున్ గనేరివాల్ చెప్పినట్లుగా తన పోస్ట్లో వివరాలు వెల్లడిస్తూ.."వర్షాకాలంలో మందార టీ చాలా మంచిది. ఇందులో సమృద్ధిగా లభించే విటమిన్లు మీ రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అయితే, మందార టీలో ఉండే యాంటీబ్యాక్టీరియల్..సీజనల్ వ్యాధుల నుంచి కాపాడుతుందని..డయాబెటిస్ నుంచి మొటిమల వరకు ఎన్నింటినో ఈ టీ బాగు చేస్తుందని..ఎవరికైనా ఈ రెసిపీ కావాలంటే మున్మున్ గనేరివాల్ ను సంప్రదించండి" అంటూ నయన్ తన పోస్ట్ ద్వారా తెలిపింది.

Also Read:-పుష్ప తిరిగొచ్చాడు...ఐకాన్ స్టార్ సెట్లో అడుగుపెట్టేది అప్పుడే!

 

 

అయితే, ఈ పోస్టుపై ఓ హెపటాలజిస్ట్ సిరియాక్ అబ్బీ ఫిలిప్స్ స్పందించాడు. సోషల్ మీడియాలో లివర్ డాక్ గా పేరుగాంచిన ఆయన.."అభిమానులను మీ సలహాలతో తప్పుదోవ పట్టిస్తున్నావంటూ నయనతారపై మండిపడ్డాడు. 8.7 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ను ఆమె తప్పుదోవ పట్టిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేగాక ఆమె మాటల్లో ఈ మాత్రం నిజం లేదని ట్విట్టర్ X ద్వారా వెల్లడించాడు. ప్రస్తుతం  ఆయన ట్వీట్‌ వైరల్‌గా మారడంతో నయనతార తన పోస్ట్‌ను తొలగించారు.

ఆ తర్వాత నయన్ పోస్ట్ డిలీట్ చేసినా కూడా ..కనీసం ఎటువంటి క్షమాపణ కూడా చెప్పలేదని కూడా నిందించారు. దీంతో నయన్ పరోక్షంగా స్పందిస్తూ ఇన్‌స్టా స్టోరీలో చేసిన పోస్ట్ ఇపుడు వైరల్ అవుతోంది. "మూర్ఖులతో ఎప్పుడూ వాదించకూడదు. వాళ్ల తమ స్థాయికి మిమ్మల్ని దిగజార్చి తమ అనుభవంతో మిమ్మల్ని ఓడిస్తారు" అన్నది దాని అర్థం.

ప్రముఖ అమెరికన్ రచయిత మార్క్ ట్వెయిన్ చెప్పిన పాపులర్ సేయింగ్ ఒకదానిని ఆమె తన స్టోరీలో పోస్ట్ చేసింది. ఇక ఈ పోస్ట్ నయన్ ఆ డాక్టర్ ను ఉద్దేశించి చేసిన పోస్టే అంటూ తమ ఫ్యాన్స్ ఫిక్సయ్యారు. మరి ఈ గొడవ ఎంతవరకు వెళుతుందో తెలియాల్సి ఉంది. కాగా గతంలో సమంత కూడా తన హెల్డ్ పాడ్‌కాస్ట్ లో ఇలాంటి సంఘటన జరిగిందే తెలిసిందే.