Pushpa 2 Update: పుష్ప తిరిగొచ్చాడు...ఐకాన్ స్టార్ సెట్లో అడుగుపెట్టేది అప్పుడే!

Pushpa 2 Update: పుష్ప తిరిగొచ్చాడు...ఐకాన్ స్టార్ సెట్లో అడుగుపెట్టేది అప్పుడే!

పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్ధాయిలో గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు.ఈ మూవీని డైరెక్టర్ సుకుమార్ ఎక్కడ రాజీ పడకుండా అద్భుతమైన విజువల్స్ తో తెరకెక్కిస్తున్నారు.ఇటీవలే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫారిన్ ట్రిప్ వెళ్లిన  సంగతి తెలిసిందే. సడెన్‌గా అల్లు అర్జున్ ఫారిన్ ట్రిప్ కి వెళ్లే టైంలో గడ్డం తీసేసి కనిపించడంతో అభిమానులకు ఎన్నో అనుమానాలు వచ్చాయి .

డైరక్టర్ సుకుమార్ కి అల్లు అర్జున్ కి విబేదాలు వచ్చాయాని ..అందువల్లే బన్ని గడ్డం తీసేశారని సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి.అయితే వాటిలో ఎంత మాత్రం నిజం లేదని ఒక సందర్భంలో నిర్మాత బన్ని వాసు క్లారిటీ ఇచ్చారు. ఇక ఇంతటితో పుకార్లకు ఎండ్ కార్డు పడింది. 

తాజాగా అల్లు అర్జున్ ఫారిన్ ట్రిప్ ముగించుకోని తిరిగి హైదరాబాద్‌ కి వచ్చారు.కాగా..ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం..అల్లు అర్జున్ వచ్చే వారం నుంచి పుష్ప 2 సెట్లో అడుగుపెట్టబోతున్నారని తెలుస్తుంది.ఇప్పటికే 80 శాతం పుర్తి చేసుకున్న పుష్ప ది రూల్ ఇక క్లైమాక్స్ మాత్రమే పెండింగ్ లో ఉంది. ప్రస్తుతం సుకుమార్ RFC లో ఇతర నటి నటులతో  సన్నివేశాలు తెరకెక్కిస్తుండగా..తరువాత వారం నుంచి అల్లు అర్జన్‌పై కొత్త షెడ్యూలులో క్లైమాక్స్ సిన్స్ షూట్ చేయబోతున్నారు. దీంతో ఐకాన్ ఫ్యాన్స్ కు పుష్ప2 పై ఆశలు మొదళ్లయ్యాయి. 

డిసెంబర్‌‌ 6న పాన్ ఇండియా స్ధాయిలో రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై ఆకాశమే హద్దుగా అంచానాలు ఉన్నాయి.ఇప్పటికే రిలీజైన సాంగ్స్ ఆండ్ టీజర్ ఈ మూవీపై  భారి అంచానాలు వచ్చేలా చేశాయి.