
కృష్ణ వంశీ, మోక్ష జంటగా చిలుకూరి ఆకాష్ రెడ్డి తెరకెక్కిస్తున్న లవ్ స్టోరీ ‘అలనాటి రామచంద్రుడు’. హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మిస్తున్నారు. ఆగస్టు 2న సినిమా విడుదల కానున్న సందర్భంగా హీరోయిన్ మోక్ష మాట్లాడుతూ ‘నేను బెంగాలీ అమ్మాయిని. ‘లక్కీ లక్ష్మణ్’ తర్వాత తెలుగులో నేను నటిస్తున్న రెండో చిత్రం ఇది. ఇదొక కమర్షియల్ పోయిటిక్ సినిమా.
ఇందులో నేను పోషించిన ధరణి పాత్ర.. చాలా హైపర్‌గా, అల్లరిగా ఉంటుంది. ప్రతి అమ్మాయి రిలేట్ చేసుకునేలా ఉంటుంది. సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాం. ఈ కథలో నేచర్ ఒక ఫిలాసఫీగా ఉంటుంది. ఆ నేచర్‌ను క్యాప్చర్ చేయడం సవాల్‌గా అనిపించింది. ఇదొక క్లాసిక్ యూనివర్సల్ లవ్ స్టోరీ. ఇందులో హీరోది స్వార్ధం లేని ప్రేమ. తన పాత్రకు సరిపోయే టైటిల్ ఇది. డైరెక్టర్ చాలా మంచి విజన్‌తో అద్భుతంగా తీశారు.
ఇక నాకు తెలుగు సినిమాలపై చాలా ఇష్టం. సావిత్రి గారి ‘దేవదాస్’ నుంచి అనుష్క గారి ‘అరుంధతి’.. సాయిపల్లవి గారి ‘విరాట పర్వం’ వరకూ చాలా సినిమాలు చూశా. ప్రస్తుతం తెలుగులో ‘రామం రాఘవం’ అనే సినిమా చేస్తున్నా. అలాగే ఓ మలయాళ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది’ అని చెప్పింది.