నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. మంగళవారం (నవంబర్ 18) ఈ చిత్రం కీలక అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. నయనతార ఇందులో హీరోయిన్‌గా నటించబోతోందని అధికారికంగా ప్రకటించారు.
తన బర్త్ డే సందర్భంగా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. హిస్టారికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఆమె క్వీన్ పాత్రను పోషిస్తున్నట్టు ఫస్ట్ లుక్ ద్వారా అర్థమవుతోంది.
సింహ, జై సింహా, శ్రీ రామరాజ్యం చిత్రాల తర్వాత బాలకృష్ణ, నయనతార కలిసి నటిస్తున్న నాలుగో చిత్రం కావడంతో ఈ కాంబినేషన్‌పై ఆసక్తి నెలకొంది. అలాగే ‘వీరసింహారెడ్డి’ తర్వాత బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కలిసి వర్క్ చేస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
