శేషన్నను రిమాండ్కు తరలించిన పోలీసులు

శేషన్నను రిమాండ్కు తరలించిన పోలీసులు

గ్యాంగ్ స్టర్ నయీం ప్రధాన అనుచరుడు శేషన్నను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. నిన్న శేషన్నను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఇవాళ హాస్పిటల్ లో మెడికల్ టెస్టులు చేయించిన అనంతరం కోర్టులో హాజరుపరిచారు. శేషన్నకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు అతడిని చంచల్ గూడ జైలుకు తరలించారు.

నయీం ఎన్ కౌంటర్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన శేషన్నను కౌంటర్ ఇంటలిజెన్స్, సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అక్రమ ఆయుధాల కేసులో హైదరాబాద్ హుమాయున్ నగర్ పోలీసులు గత వారం అక్బర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతడు ఇచ్చిన సమాచారంతో శేషన్నపై పోలీసులు నిఘా పెట్టారు. షేక్ పేట క్రాస్ రోడ్ లో ఓ సెటిల్ మెంట్ కు వచ్చినట్టు తెలుసుకొని శేషనన్నను అదుపులోకి తీసుకున్నారు. నానక్ రాంగూడ నుండి గచ్చిబౌలి వెళుతుండగా శేషన్నను పట్టుకొని ముందుగా హుమాయూన్ నగర్ పీఎస్ కు తీసుకుకెళ్లారు. విచారణలో కీలక ఆధారాలు సేకరించారు. గోల్కొండ, హుమాయున్ నగర్ పీఎస్ ల లిమిట్స్ లో నాలుగు పిస్టల్స్ అమ్మినట్టు గుర్తించారు. గతంలో నయీంతో కలిసి నేరాలకు సంబంధించిన కేసుల్లోను దర్యాప్తు చేస్తున్నారు. శేషన్న దగ్గరి నుంచి 9 ఎంఎం పిస్టల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

గ్యాంగ్ స్టర్ నయీంతో కలిసి శేషన్న చాలా నేరాలు చేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఐపీఎస్ వ్యాస్ హత్య కేసులో శేషన్న నిందితుడిగా ఉన్నాడు. శేషన్నపై వివిధ పోలీస్ స్టేషన్లలో 9 కేసులు ఉన్నాయి. వీటిలో 6 మర్డర్ కేసులు, 3 ఆర్మ్స్ యాక్ట్ కేసులు ఉన్నాయి. 1993లో శేషన్నను మొదటిసారి సనత్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నయీంతో కలిసి శేషన్న మావోయిస్టు కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. సుదర్శన్ రెడ్డితో పాటు నాగన్న, మాధవన్న, మల్లన్న వంటి దాదాపు 15 మంది కమాండర్స్ దగ్గర పని చేశాడు. మావోయిస్టులకు కొరియర్ గా, డెన్ కీపర్ గా ఉన్నాడు.