నయీం గ్యాంగ్​సభ్యుడు అరెస్ట్

నయీం గ్యాంగ్​సభ్యుడు అరెస్ట్

హనుమకొండ, వెలుగు : వరంగల్ కమిషనరేట్ పరిధిలో భూదందాలు, సెటిల్​మెంట్లు చేస్తూ తుపాకీతో బెదిరించిన కేసులో నయీం గ్యాంగ్​సభ్యుడు ముద్దసాని వేణుగోపాల్​ను కేయూ పోలీసులు అరెస్ట్ చేశారు. జులై 29న కేసు నమోదు కాగా.. నెలన్నర తరువాత అదుపులోకి తీసుకున్నారు. హనుమకొండ పెగడపల్లి డబ్బాల ప్రాంతంలోని తన ఇంటికి సోమవారం రాగా పట్టుకొని పరకాల సబ్ జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

నిందితుడి నుంచి రూ.18 లక్షల క్యాష్​, డాక్యుమెంట్స్​ స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. హనుమకొండ ఆరెపల్లి వద్ద ఓ భూవివాదం విషయంలో బాధితుడి నుంచి డబ్బులు తీసుకుని తిరిగి ఆయననే తుపాకీతో బెదిరించడంతో హసన్​పర్తి, కేయూ, హనుమకొండ పీఎస్​ల పరిధిలో వేణుగోపాల్, ములుగు జిల్లాలో పని చేసే రిజర్వ్​ఇన్​స్పెక్టర్ ​సంపత్​ సహా 10 మందిపై జులై 29న పోలీసులు కేసులు నమోదు చేశారు. తర్వాత రోజు  ఆరుగురిని, ఆగస్టు 20న ఆర్ఐ సంపత్​ ​ను అరెస్ట్ చేశారు. ఇన్ని రోజులకు  వేణుగోపాల్​ ను అరెస్ట్​ చేసి రిమాండ్​కు పంపించారు. .