నేను చాలా సెల్ఫిష్

నేను చాలా సెల్ఫిష్

ఓవైపు ‘పుష్ప’ సినిమాతో  ఫహాద్ ఫాజిల్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తే.. ఆయన భార్య నజ్రియా ‘అంటే సుందరానికీ’ చిత్రంతో తెలుగునాట అడుగు పెడుతోంది. నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 10న విడుదలవుతున్న సందర్భంగా సినిమా గురించి, తన పర్సనల్ లైఫ్‌‌‌‌ గురించి నజ్రియా ఇలా ముచ్చటించింది.

  • లవ్, ఎమోషన్, ఫన్ లాంటి అన్ని కమర్షియల్ అంశాలూ ఉన్న ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్ ఇది. నా క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్. కాస్త ఇన్నోసెంట్‌‌‌‌ కూడా. అయ్యో పాపం అనేలా ఉంటుంది. అయితే క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌లో చాలా లేయర్స్ ఉన్నాయి. నా రియల్‌‌‌‌ లైఫ్‌‌‌‌కి పూర్తి భిన్నంగా ఉంటుంది. 
  •  స్క్రిప్ట్ వినేటప్పుడు ఓ సాధారణ ప్రేక్షకురాలిలా వింటాను. ఆ తర్వాత అది ఏ లాంగ్వేజ్ అని ఆలోచిస్తాను. నా కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఎక్కువ సినిమాలు డెబ్యూ డైరెక్టర్స్‌‌‌‌తోనే చేశా. ఈ సినిమా ఫలానా హీరోతో చేస్తే నెక్స్ట్ మూవీకి సూపర్ స్టార్‌‌‌‌‌‌‌‌తో చేయొచ్చు అనే లెక్కలు వేసుకుని సినిమాలు చేయను. నా ఫస్ట్ ప్రయారిటీ స్క్రిప్ట్. ఈ సినిమా విషయంలో కూడా నాని నటిస్తున్నాడు అని కాకుండా లీలా థామస్, సుందర్ పాత్రలు నచ్చి నటించాను. 
  •  డబ్బింగ్ సినిమాల ద్వారా నేను తెలుగువారికి పరిచయం. అవి వచ్చి కూడా చాలా కాలమైంది. ఇంత గ్యాప్ వచ్చినా తెలుగు ప్రేక్షకులు నాపై  అభిమానం చూపించడం నా అదృష్టం. నిజానికి నా సినిమాల రిలీజ్‌‌‌‌ టైమ్‌‌‌‌లో పెద్దగా టెన్షన్ పడను. కానీ ఈ సినిమా విషయంలో కొంత టెన్షన్ పడుతున్నా. నన్ను ఇష్టపడ్డ తెలుగు ప్రేక్షకులు నా తెలుగును ఎంతవరకూ యాక్సెప్ట్ చేస్తారు అనే టెన్షన్ ఉంది.  పైగా ఇందులో నేనే డబ్బింగ్ చెప్పాను. యాభై శాతం యాక్టింగ్ మన వాయిస్‌‌‌‌లోనే ఉంటుందని నమ్ముతా. నేను నటించేటప్పుడు ఉన్న ఫీల్ మరొకరు డబ్బింగ్ చెప్తే రాకపోవచ్చు. 
  •  భవిష్యత్తులో నేను  ఓపెన్‌‌‌‌గా డేట్స్‌‌‌‌ ఇచ్చే డైరెక్టర్ వివేక్. చాలా నిజాయతీగా తీస్తాడు. కామెడీ కోసమంటూ ప్రత్యేకంగా సీన్స్ రాయడు, తీయడు. తన కథలోనే అది మిక్స్ అయి ఉంటుంది. ఇకపై వివేక్ ప్రతి సినిమాను ఫస్ట్ డే, ఫస్ట్ షో చూస్తా. తన లాస్ట్ మూవీస్ అన్నీ చూశాను. కానీ ఈ సినిమా ఒప్పుకుంది మాత్రం అవి చూసి కాదు. నేరేషన్ నచ్చి.  వెంటనే మరో తెలుగు సినిమా చేయాలనే అనుకుంటున్నా. మనసుకు నచ్చే సబ్జెక్ట్ ఎంత త్వరగా వస్తే అంత త్వరగా నా నెక్స్ట్ తెలుగు మూవీ ఉంటుంది.  నా దగ్గరకు వచ్చే దర్శకులు వివేక్‌‌‌‌లా మంచి సబ్జెక్ట్స్‌‌‌‌తో వస్తే చాలు. లైఫ్‌‌‌‌లో మనం చూడని కొత్త విషయమేదీ సినిమాలో ఉండదు. పాత సబ్జెక్టే అయినా డిఫరెంట్‌‌‌‌ వేలో కన్విన్సింగ్‌‌‌‌గా చెప్పగలిగేలా ఉంటే కచ్చితంగా చేస్తాను. ఇక నేను చాలా సెల్ఫిష్‌‌‌‌ (నవ్వుతూ). రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు మొదలు సత్యదేవ్ వరకు. తెలుగులో ఉన్న అందరు హీరోలతో నటించాలనుకుంటున్నా. 
  •  కెరీర్‌‌‌‌‌‌‌‌ విషయంలో ప్లాన్ చేసి బ్రేక్ తీసుకోలేదు. ఎక్సైట్ అనిపించినవి చేస్తూ వస్తున్నా. ఫహద్ కూడా ఎందుకు రిలాక్స్ అవుతున్నావ్, స్క్రిప్ట్స్ విను అంటుంటాడు. కానీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ స్టార్ అనిపించుకోవాలని నాకు లేదు. మంచి మూవీస్‌‌‌‌లో పార్ట్ అయితే చాలు. నేను సినిమాలు చేయకపోయినా ప్రేక్షకులు నన్ను ఇంతలా అభిమానించడం నాకు బోనస్.నేను,
  • నేను ఫహాద్ ఒకేసారి తెలుగులో ఎంట్రీ ఇవ్వడం  కో ఇన్సిడెన్స్‌‌‌‌.  మైత్రి మూవీ మేకర్సే ఇందుకు కారణం. మొదట నేను ఈ మూవీకి కమిటయ్యాను. ఆ తర్వాత ‘పుష్ప’కి ఫహాద్ సైన్ చేశాడు. ఇద్దరమూ కలిసి సినిమాలు చూస్తుంటాం, చర్చిస్తుంటాం. ఒకరి సినిమాల గురించి మరొకరం డిస్కస్ చేస్తాం. కానీ ఎవరి డెసిషన్ వాళ్లే తీసుకుంటాం.