
నందమూరి నటసింహం ‘బాలకృష్ణ’ లోని మరో కోణం చూపించిన ప్రోగ్రాం ‘అన్ స్టాపబుల్’. ‘ఆహా’ ఓటీటీలో బాలకృష్ణ హోస్ట్ గా టెలికాస్ట్ అయిన ఈ ప్రోగ్రాం అందరినీ ఆకట్టుకుంది. బాలయ్య చేసిన ఎంటర్ టైన్ మెంట్ అంతా ఇంతా కాదు. హోస్ట్ లతో సందడి సందడిగా మారిన ఈ కార్యక్రమం బాలయ్య అభిమానులనే కాకుండా ప్రేక్షకులను మెప్పించింది. అన్ స్టాపబుల్ సీజన్ 2 కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సీజన్ 2 కమింగ్ సూన్ అంటూ అప్పట్లో ఆహా టీం పోస్టు చేసింది. కానీ.. ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. తాజాగా.. ఆహా క్లారిటీ ఇచ్చింది. త్వరలోనే అన్ స్టాపబుల్ సీజన్ 2 ప్రారంభం కాబోతోందని ట్వీట్ చేసింది.
ఈ సంవత్సరంలోనే పండుగ త్వరలో ప్రారంభం కాబోతున్నట్లుగా ప్రకటించింది. ‘దెబ్బకు థింకింగ్ మారిపోవాలా’ అంటూ పేర్కొంది. బాలయ్య అభిమానులు ఫుల్ ఖుష్ అయిపోతున్నారు. ఈసారి ఎవరెవరు గెస్ట్ లు గా వస్తారా అని ఆలోచిస్తున్నారు. అన్ స్టాపబుల్ 2 ప్రోగ్రాం మాత్రం కొత్తగా ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. మరింత ఎంటరైన్ మెంట్ తో పాటు రికార్డ్స్ సృష్టించడం ఖాయమంటున్నారు. గతంలో జరిగిన అన్ స్టాపబుల్ మొదటి సీజన్ లో అఖండ టీం, బ్రహ్మానందం, మంచు ఫ్యామిలీ, మహేష్ బాబు, రాజమౌళితో పాటు పలువురు సెలబ్రెటీలు వచ్చి అలరించారు.
It's that time of the year and festival begins soon!??
— ahavideoin (@ahavideoIN) September 16, 2022
Debbaku thinking maarpiovala.#UnstoppableWithNBK2 athi thvaralo...?#nandamuribalakrishna@realmeIndia @tnldoublehorse #chandanabrothers @Fun88India #mansion_house pic.twitter.com/LQHw2MzAMP