
ఇటీవల థ్యాంక్యూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగ చైతన్య.. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఒ సినిమా చేస్తున్నాడు. శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నాడు. హీరోగా చైతూకు ఇది 22వ సినిమా. ఈ సినిమా రెగ్యులర్ షూటింగుకి డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ నెల 21 నుంచి ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీనికి సంబంధించిన పోస్టర్ కూడా విడుదల చేశారు.
ఈ సినిమాలో నాగ చైతన్య పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నట్టు పోస్టర్ చూస్తే తెలుస్తోంది. ఈ సినిమాకి ఇళయరాజా ఆయన తనయుడు యువన్ శంకర్ రాజా కలిసి సంగీతం అందించనున్నారు. ఇందులో కృతిశెట్టి మరోసారి చైతూతో జోడీ కడుతోంది. ఇక 'థ్యాంక్యూ' సినిమా ఫ్లాప్ తో డీలాపడిన చైతూకి ఈ సినిమాతో హిట్ పడుతుందేమో చూడాలి.
With Divine Blessings of #ANR Garu,
— Srinivasaa Chitturi (@srinivasaaoffl) September 20, 2022
We announce an electrifying update about our prestigious project in collaboration with @chay_akkineni and @vp_offl#NC22ActionBegins from tomorrow ⚡️?@IamKrithiShetty @ilaiyaraaja @thisisysr @SS_Screens #VP11 #ANRLivesOn pic.twitter.com/ZSnAg3VdNx