న్యూఢిల్లీ: ఎన్సీఈఆర్టీ కొత్తగా విడుదల చేసిన 9వ తరగతి సోషల్ సైన్స్ పాఠ్యపుస్తకంలో భారతదేశ జాతీయ నినాదమైన సత్యమేవ జయతే చారిత్రక మూలాల గురించి ప్రత్యేకంగా వివరించారు. పాఠ్యపుస్తకంలోని ‘గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ’ అనే అధ్యాయంలో ఈ వివరాలను పొందుపరిచారు.
సత్యమేవ జయతే అనేది ముండక ఉపనిషత్తు నుంచి, సుప్రీంకోర్టు అధికారిక నినాదం ‘యతో ధర్మస్తతో జయః’ వాక్యాన్ని మహాభారతం నుంచి సేకరించినట్లు ఈ పుస్తకంలోపేర్కొన్నారు. ఆధునిక ప్రజాస్వామ్య సంస్థలు తమ పరిపాలనా విలువలను, ఆదర్శాలను దేశ పురాతన సంప్రదాయాలు, గ్రంథాల నుంచి ఎలా స్వీకరించాయో విద్యార్థులకు తెలియజేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు.
