కెరీర్‌ కు దిక్సూచిగా ‘తమన్నా’ టెస్ట్

కెరీర్‌ కు దిక్సూచిగా ‘తమన్నా’ టెస్ట్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 9, 10వ తరగతి స్టూడెంట్లు తమ భవిష్యత్ చదువులు, కెరీర్‌ను పక్కాగా ప్లాన్ చేసుకునేందుకు కేంద్ర విద్యా శాఖ పరిధిలోని ఎన్సీఈఆర్టీ ‘తమన్నా’ (ట్రై అండ్ మెజర్ ఆప్టిట్యూడ్ అండ్ నేచురల్ ఎబిలిటీస్) పేరుతో ఆన్‌లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌ను అందుబాటులోకి తెచ్చింది.  కెరీర్ మార్గాలను ఎంచుకునేందుకు ఈ పరీక్ష ఉపయోగపడనున్నది.

‘తమన్నా’ టెస్ట్‌పై స్టూడెంట్లకు అవగాహన కల్పించి, పరీక్ష రాసేలా ప్రోత్సహించాలని ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్ రమేశ్ డీఈఓలకు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాల్లోని అన్ని హైస్కూళ్ల హెచ్‌ఎంలు, టీచర్లు ఈ సమాచారాన్ని 9, 10వ తరగతి విద్యార్థులకు చేరవేయాలని సూచించారు. ఆన్‌లైన్‌లో పరీక్ష రాసేందుకు అవసరమైన గైడెన్స్ ఇవ్వాలని కోరారు. ఆసక్తి ఉన్న స్టూడెంట్లు https://tamanna.ncert.gov.in/ వెబ్‌సైట్‌లో టెస్ట్ రాయవచ్చని తెలిపారు.