నా ఫోన్ ట్యాప్ చేస్తున్రు..ప్రధాని మోదీకీ తెలుసు..రాహుల్ సంచలన ఆరోపణ

నా ఫోన్  ట్యాప్ చేస్తున్రు..ప్రధాని మోదీకీ తెలుసు..రాహుల్ సంచలన ఆరోపణ
  • రాహుల్ గాంధీ సంచలన ఆరోపణ
  • ఆధారాలన్నీ ఈ ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఉన్నయ్
  • చర్చకు సిద్ధమని ఇన్​స్టా ‘ఆస్క్ మీ’ సెషన్​లో మోదీకి సవాల్

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ తన ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ట్యాప్ చేయిస్తున్నారని లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణ చేశారు. ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శుక్రవారం నిర్వహించిన ‘ఆస్క్ మీ’ సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మద్దతుదారుల ప్రశ్నలకు సమాధానమిస్తూ, తన మొబైల్ ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చూపించి.. ‘ఆధారాలన్నీ ఈ ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఉన్నయ్. నా ఫోన్ ట్యాప్ చేయిస్తున్నారు.. ఆ విషయం ప్రధానికి కూడా తెలుసు’ అని అన్నారు. ప్రధాని విదేశీ శక్తుల ప్రభావంలో ఉన్నారని ఆరోపించిన రాహుల్, దీనిపై ముఖాముఖి బహిరంగ చర్చకు రావాలని మోదీకి మరోసారి సవాల్ విసిరారు. 

‘నా సవాల్ అలాగే ఉంది. ఆయన ముఖాముఖి చర్చకు వచ్చిన రోజు విదేశీ శక్తుల నియంత్రణలో ఉన్నది ఎవరో, దేశద్రోహి ఎవరో, ఎప్పటినుంచో, ఇంకా నా ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న ఎన్నో వివరాలు అందరికీ తెలుస్తాయి’ అని కాంగ్రెస్ ‘ఎక్స్’లో షేర్ చేసిన వీడియోలో అన్నారు.  పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అసలు అంశాలపై చర్చ నుంచి తప్పించుకుంటూ రాహుల్ డిబేట్ సవాళ్లు విసురుతున్నారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. చర్చకు పార్లమెంట్ వేదికగా ఉండగా, ప్రధానిని వేదిక ఎంచుకోమని రాహుల్ అడగడమేంటని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇదివరకే ప్రశ్నించారు. రాహుల్ ఆరోపణలను కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనేత్ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గట్టిగా సమర్థించారు. రాహుల్, మోదీ మధ్య చర్చ జరగాలని ఓ సర్వేలో 73% మంది కోరుకున్నారని చెప్పారు. మోదీ చర్చను తప్పించుకుంటున్నారని, ఆయన అమెరికా చెప్పినట్టు నడుచుకుంటున్నారని ఆరోపించారు.

12 రోజుల్లో ఏడోసారి సవాల్

ప్రధానిని బహిరంగ చర్చకు రావాలని రాహుల్​ సవాల్ చేయడం 12 రోజుల్లో ఇది ఏడోసారి. ప్రధాని మోదీ ఇటీవల బస్తర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జవాన్లతో దీపావళి జరుపుకున్న సందర్భంగా రాజకీయ పార్టీల్లోకి ‘దిమాగీ నక్సల్స్’ చొరబడ్డారని వ్యాఖ్యానించిన తర్వాత ఆయన వరుసగా సవాళ్లు విసురుతున్నారు. ఎన్నికల ప్రక్రియ, విదేశీ ప్రభావం, జాతీయ భద్రత వంటి అంశాలపై బహిరంగ చర్చ జరగాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రధానిని చర్చకు ఒప్పించాలని ఆయనకు సన్నిహితులైన కేంద్ర మంత్రులనూ కోరారు. 

ఫోన్ ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై రాహుల్ ఆరోపణలు చేయడం ఇదే తొలిసారి కాదు. ‘నా ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ పెగాసస్ ఉంది. చాలా మంది రాజకీయ నాయకుల ఫోన్లలో పెగాసస్ ఉంది. ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జాగ్రత్తగా మాట్లాడాలని, మేం రికార్డ్ చేస్తున్నామని ఇంటెలిజెన్స్ అధికారులే నాకు చెప్పారు’ అని 2023లో ఆయన ఆరోపించారు. అప్పట్లో కేంద్రం ఆ ఆరోపణలను ఖండించింది.