బార్ల అదనపు ఫీజు వివాదం సింగిల్ జడ్జి వద్దకే..ఫీజు వసూలుపై స్టే ఎత్తివేసిన డివిజన్ బెంచ్ 

బార్ల అదనపు ఫీజు వివాదం సింగిల్ జడ్జి వద్దకే..ఫీజు వసూలుపై స్టే ఎత్తివేసిన డివిజన్ బెంచ్ 

హైదరాబాద్, వెలుగు: బార్‌‌‌‌ అండ్‌‌‌‌ రెస్టారెంట్ల నుంచి స్పెషల్ ప్రివిలేజ్ ఫీజు వసూలు వివాదాన్ని సింగిల్ జడ్జి వద్దే తేల్చుకోవాలని హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. ఫీజు వసూలును నిలిపివేస్తూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను శుక్రవారం రద్దు చేసింది. ఎక్సైజ్ శాఖ జారీ చేసిన జీవో, సర్క్యులర్‌‌‌‌ను సవాలు చేస్తూ 114 మందికి పైగా బార్ల యజమానులు పిటిషన్లు వేశారు.

వీటిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి గత నెల 31న ఫీజు వసూలుపై స్టే ఇచ్చారు. దీనిని సవాలు చేస్తూ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌‌‌‌ను ఆశ్రయించింది. యాక్టింగ్ చీఫ్ జస్టిస్ పి. శ్యామ్ కోశీ, జస్టిస్ సుద్దాల చలపతిరావులతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసింది. జీవోల చట్టబద్ధతపై సింగిల్ జడ్జి వద్దే విచారణ కొనసాగించాలని స్పష్టం చేస్తూ ప్రభుత్వ అప్పీలుపై విచారణను వాయిదా వేసింది.