
ముంబై: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఫైర్ అయ్యారు. తనను ‘అవినీతికి సూత్రధారి’ అంటూ అమిత్‌షా ఇటీవల చేసిన వ్యాఖ్యలపై గట్టిగా కౌంటర్ ఇచ్చారు. గుజరాత్ నుంచి సుప్రీంకోర్టు బహిష్కరించిన వ్యక్తి ఈరోజు దేశానికి హోంమంత్రిగా ఉండటం విచిత్రంగా ఉందని పవార్ పేర్కొన్నారు. కాగా, ఈ నెల 21న పుణెలో బీజేపీ మీటింగ్ లో షా మాట్లాడుతూ.. భారత రాజకీయాల్లో అవినీతికి రింగ్ లీడర్ శరద్ పవార్ అని అన్నారు. మరాఠా రిజర్వేషన్లను స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని.. తాము అధికారంలోకి వస్తే ఈ రిజర్వేషన్లు కొనసాగిస్తామన్నారు.