ఇంటర్​తో ఎన్​డీఏ అడ్మిషన్స్​

ఇంటర్​తో ఎన్​డీఏ అడ్మిషన్స్​

దేశానికి సేవ చేయడంతోపాటు మంచి ఉద్యోగ జీవితంలో స్థిరపడాలనుకునే వారికి నేషనల్​డిఫెన్స్​ అకాడమీ అండ్​ నావల్​ అకాడమీ మంచి అవకాశం ఇస్తుంది. యూపీఎస్సీ ఏటా రెండుసార్లు నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ (ఎన్‌‌‌‌‌‌‌‌డీఏ అండ్ ఎన్ఏ) పేరుతో పరీక్షలు నిర్వహిస్తోంది. దీని ద్వారా త్రివిధ దళాల విభాగాల్లో 2 జనవరి 2025 నుంచి ప్రారంభమయ్యే 153వ కోర్సులో, 115వ ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్ఏసీ) కోర్సులో అడ్మిషన్స్​ కల్పిస్తారు.

ఖాళీలు: మొత్తం 400 ఖాళీలకు ప్రకటన వెలువడింది. అందులో నేషనల్ డిఫెన్స్ అకాడమీ పోస్టులు 370 (ఆర్మీ-208, నేవీ-42, ఏయిర్‌‌‌‌‌‌‌‌ఫోర్స్- 120) ఉన్నాయి. వాటిలో 28 గ్రౌండ్ డ్యూటీకి సంబంధించిన ఖాళీలు. నేవల్ అకాడమీ (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్) ఖాళీలు 30 ఉన్నాయి. ఆర్మీ వింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి.


సెలెక్షన్​ ప్రాసెస్​: అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. రాత పరీక్ష, ఇంటెలిజెన్స్- పర్సనాలిటీ టెస్ట్, ఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌బీ టెస్ట్‌‌‌‌‌‌‌‌/ ఇంటర్వ్యూ, మెడికల్‌‌‌‌‌‌‌‌ టెస్టు ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. 


అప్లికేషన్స్​: దరఖాస్తులను డిసెంబర్​ 20 నుంచి జనవరి 9 వరకు ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో పంపాలి. ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ రాత పరీక్ష ఏప్రిల్​ 21న నిర్వహిస్తారు.  పూ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్తి వివరాలకు  www.upsc.gov.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.