బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఫలితాలు రౌండ్‌ల వారీగా ప్రకటిస్తున్నారు. ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ముందంజలో ఉంది. ప్రస్తుతం ఎన్డీయే కూటమి 191 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. మహాగట్బంధన్ కూటమి 49 స్థానాల్లో మాత్రమే లీడ్ లో కొనసాగుతోంది. 84 స్థానాల్లో ఆధిక్యంతో జేడీయూ పార్టీ, 80 స్థానాల్లో బీజేపీ, 34 స్థానాల్లో ఆర్జేడీ, 5 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీలు లీడ్ లో ఉన్నాయి. అధికారు ఎన్బీయే కూటమి ఈ ఫలితాల్లో మ్యాజిక్ ఫిగర్ దాటింది.
శుక్రవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ECI ప్రోటోకాల్ ప్రకారం ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. ఆ తర్వాత ఉదయం 8:30 గంటల నుండి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (EVMలు) లెక్కింపు మొదలు పెట్టారు.
