రూపీ డినామినేటెడ్​ బాండ్స్​ రానున్నాయ్.. ఎన్​డీబీ ప్లాన్​

రూపీ డినామినేటెడ్​ బాండ్స్​ రానున్నాయ్.. ఎన్​డీబీ ప్లాన్​

న్యూఢిల్లీ :  వచ్చే ఏడాది రూపీ డినామినేటెడ్​ బాండ్స్​ ఇష్యూ ద్వారా ఫండ్స్​ సమీకరించాలని న్యూ డెవలప్​మెంట్​ బ్యాంక్​ ప్లాన్​ చేస్తోంది.  ఇండియాలోని ప్రాజెక్టులకు అవసరమైన ఫండ్స్​ కోసం ఈ విధంగా రూపీ బాండ్స్​ఇష్యూ చేసే ఆప్షన్​ పరిశీలిస్తున్నట్లు ఎన్​డీబీ సీనియర్​ ఆఫీసర్​ ఒకరు మంగళవారం వెల్లడించారు. లోకల్​ కరెన్సీ రిసోర్సెస్​ సేకరించడం అనేది ఎన్​డీబీ వ్యూహంలో ఒక భాగమని, మొత్తం రిసోర్సెస్​లో  30 శాతాన్ని ఈ రూపంలో సమీకరిస్తామని ఎన్​డీబీ చీఫ్​ రిస్క్​ ఆఫీసర్​ అనిల్​ కిషోరియా​ చెప్పారు. 

బ్రెజిల్​, రష్యా, ఇండియా, చైనా, సౌత్​ ఆఫ్రికా (బ్రిక్స్​ దేశాలు) లు కలిసి న్యూ డెవలప్​మెంట్​ బ్యాంక్​ను 2014 లో షాంఘై హెడ్​క్వార్టర్స్​గా ఏర్పాటు చేశాయి. ఇటీవలే సౌత్​ ఆఫ్రికా కరెన్సీ ర్యాండ్​లోనూ నిధులు సమీకరించినట్లు కిషోరియా వెల్లడించారు. వచ్చే ఏడాది రూపీ డినామినేటెడ్​ బాండ్స్​ ఇష్యూకు అవసరమైన అనుమతులు వస్తాయని అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు. 

ఎంత మొత్తం సేకరించేదీ ఇప్పుడే చెప్పలేమని అన్నారు. లోకల్​ కరెన్సీలో నిధులు సమీకరించడం వల్ల ఫారెక్స్​ రిస్క్​ తగ్గడంతోపాటు, ఫైనాన్సింగ్​ సులభమవుతుందని ఆయన వివరించారు. ఢిల్లీ–మీరట్​ రీజినల్​ ర్యాపిడ్​ ట్రాన్సిట్ సిస్టమ్​, ముంబై, ఇండోర్​ మెట్రో వంటి ఇంపార్టెంట్​ ప్రాజెక్టులకు ఎన్​డీబీ డబ్బు ఇచ్చినట్లు చెప్పారు. రాజస్థాన్​, మణిపూర్​, హిమాచల్​ ప్రదేశ్​లలో వాటర్​ ప్రాజెక్టులకు, మేఘాలయాలో ఎకో టూరిజమ్​ ప్రాజెక్టులకు కూడా తాము నిధులు సమకూర్చినట్లు కిషోరియా వెల్లడించారు.